NTR : నందమూరి తారకరామారావు తర్వాత ఆయన లేజసీ ని ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ ఏ రేంజ్ కి తీసుకెళ్లాడో మన అందరికీ తెలిసిందే.ఎన్టీఆర్ కొడుకుగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకొని మాస్ లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు.అప్పట్లో మాస్ అంటే బాలకృష్ణ నే గుర్తుకు వస్తాడు.

అయితే అదంతా ఒకప్పుడు, ఎప్పుడైతే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సక్సెస్ అయ్యాడో, అప్పటి నుండి నందమూరి లేజసీ ని మోస్తూ వచ్చాడు, ఎన్టీఆర్ అనే పేరు ని ప్రపంచం మొత్తం మారుమోగిపోయ్యేలా చేసి, నందమూరి ఫ్యామిలీ ఇంకో పదికాలాల పాటు సినీ రంగం లో ఒక వెలుగు వెలిగేంత స్టార్ స్టేటస్ ని ఇచ్చాడు.అలాంటి ఎన్టీఆర్ ని నందమూరి బాలకృష్ణ మరియు నారా చంద్రబాబు నాయుడు మొదటి నుండి అవమానిస్తూనే ఉన్నారు.

నిన్న విజయవాడ లోని పోరంకి మండలం లో నందమూరి తారకరామారావు శత జయంతి దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే.ఈ ఈవెంట్ కి సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు, ఈ ఈవెంట్ కి నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.ఇదంతా పక్కన పెడితే ఈ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ ని ఆహ్వానించడానికి ఇష్టపడలేదు బాలయ్య.కనీసం నందమూరి సినీ ప్రస్థానం గురించి మాట్లాడుతున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా తియ్యడానికి ఇష్టపడలేదు.

ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ నుండి స్టార్ హీరో అంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే, నిన్న జరిగిన ఎన్టీఆర్ జన్మదిన వేడుకల్లో కూడా 90 శాతం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హాజరై ఉంటారు.కనీసం వాళ్ళ కోసమైనా ఎన్టీఆర్ ని ఫార్మాలిటీ గా కూడా ఆహ్వానించలేదు బాలయ్య.దీనిని బట్టీ ఎన్టీఆర్ అంటే బాలయ్య కి ఎంత అసూయ అనేది అర్థం అవుతుంది అంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు.ఎన్టీఆర్ ఎదో ఒక రోజు తెలుగు దేశం పార్టీ కి రివర్స్ అయ్యి, కొత్త రాజకీయ పార్టీ స్థాపిస్తే, తెలుగు దేశం పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుందని, అంత వరకు పరిస్థితి తెచ్చుకోవద్దు అని వార్నింగ్ ఇస్తున్నారు ఫ్యాన్స్.
