JR NTR : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకొని వరుసగా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డ్స్ ని సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్ గా ఆస్కార్ అవార్డ్స్ లో నామినేషన్స్ ని దక్కించుకున్న ఈ చిత్రానికి ఇప్పుడు ఆ అవార్డు దక్కుతుందా లేదా అనేది ఈ ఆదివారం రోజు తెలియనుంది.ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు రామ్ చరణ్ మరియు రాజమౌళి గత వారం రోజుల నుండి అమెరికా లోనే మకాం వేశారు.

అక్కడ రెగ్యులర్ గా ప్రొమోషన్స్ లో పాల్గొంటూ ఎన్నో ప్రముఖ మీడియా చానెల్స్ కి ప్రత్యేక ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు.అయితే జూనియర్ మాత్రం తన సోదరుడు తారకరత్న చనిపోవడం తో ఈ ప్రొమోషన్స్ కి దూరంగా ఉంటూ వచ్చాడు.HCA అవార్డ్స్ కి కూడా ఆయన హాజరు కాలేదు, కానీ ఈ ఆదివారం నాడు జరగబొయ్యే ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ కి మాత్రం హాజరు కాబోతున్నాడు.

నిన్ననే అమెరికా లో ల్యాండ్ అయినా జూనియర్ ఎన్టీఆర్ నేడు అభిమానులతో ఫోటోలు దిగి, కాసేపు వాళ్ళతో ముచ్చటించాడు, కానీ ఇప్పటి వరకు ఆయన #RRR మూవీ టీం తో కలవకపోవడం ఆశ్చర్యాన్ని కలుగచేస్తుంది.ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు, ఫారిన్ టూర్స్ కి వెళ్ళినప్పుడల్లా రామ్ చరణ్ మరియు రాజమౌళి ఏ హోటల్ లో అయితే ఉండేవారో, అదే హోటల్ లో ఎన్టీఆర్ కూడా దిగేవాడు, కానీ ఇప్పుడు అలా కాకుండా వాళ్లకి దూరం గా ప్రత్యేమైన హోటల్ లో ఉండడం చర్చనీయాంశంగా మారింది.

HCA అవార్డ్స్ విషయం లో ఎన్టీఆర్ #RRR మూవీ టీం పై తీవ్రమైన అసంతృప్తి తో ఉన్నట్టు తెలుస్తుంది. స్పాట్ లైట్ అవార్డ్స్ లో తన పేరు ఊసే పెద్ద రానివ్వకుండా , కేవలం రామ్ చరణ్ పేరుకి ఎక్కువ పబ్లిసిటీ చెయ్యడం ఎన్టీఆర్ ని నిరాశకి గురి చేసిందట. ఇక రామ్ చరణ్ కూడా తన గురించి తక్కువ ప్రస్తావించడం పై ఎన్టీఆర్ అసంతృప్తి తో ఉన్నట్టు ఫిలిం నగర్ లో వినిపిస్తున్న గుసగుస.
