JR NTR : నందమూరి తారకరత్న ఇటీవలే నారాలోకేష్ పాదయాత్ర ప్రారంభానికి హాజరై అకస్మాత్తుగా గుండె పోటు వచ్చి కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత ఆయనని సమీపం లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి అత్యవసర చికిత్స అందించారు..ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరు కి షిఫ్ట్ చేసారు..అక్కడకి వెళ్లిన తర్వాత తారకరత్న గురించి గంటకు ఒక న్యూస్ బులిటెన్ విడుదల అవుతున్నాయి.
ప్రతి బులిటెన్ లో తారకరత్న కోలుకుంటున్నాడు అనే వార్త వింటామేమో అని ఎదురు చూసిన నందమూరి ఫ్యాన్స్ కి నిరాశే ఎదురు అవుతుంది.. ఇక ఈరోజు ఉదయం జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ తారకరత్నని చూసేందుకు బెంగళూరు కి చేరుకున్నారు.. అనంతరం జూనియర్ ఎన్టీఆర్ తారకరత్న ఆరోగ్యపరిస్థితి పై కీలక ప్రకటన చేసాడు.
జూనియర్ ఎన్టీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ తారకరత్న ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగానే ఉంది.. ఆయనకీ మెరుగైన వైద్యం అందిస్తున్నారు.. చికిత్స కి కూడా ఆయన బాగానే రెస్పాండ్ అవుతున్నాడు.. ఆయన క్రిటికల్ స్టేజి నుండి బయటపడ్డాడు అని మాత్రం చెప్పను కానీ.. స్టేబుల్ గా ఉన్నాడు.. చికిత్స కొనసాగుతూనే ఉంది.. అభిమానుల దీవెనల వల్ల ఆయన సంపూర్ణ ఆరోగ్యం తో బయటకి వస్తాడని ఆశిస్తున్నాను ‘ అంటూ ఎన్టీఆర్ ఈ సందర్భంగా మాట్లాడాడు.. అయితే చికిత్స కి స్పందిస్తున్నాడు అన్నారు కదా.. ఏ విధంగా స్పందిస్తున్నదని విలేకరులు అడగగా , జూనియర్ ఎన్టీఆర్ దానికి సమాధానం చెప్తూ ‘అవన్నీ చెప్పడానికి నేనేమి డాక్టర్ ని కాదు’ అంటాయి సమాధానం ఇచ్చాడు.