JR NTR : ప్రస్తుతం ‘దేవర’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ నెలలోనే రావాల్సిన ఈ చిత్రం.. షూటింగ్ లేట్ అవ్వడంతో అక్టోబర్ కి పోస్టుపోన్ అయ్యింది. ఇది ఇలా ఉంటే, ఎన్టీఆర్ తాజాగా ఓ కొత్త కారుని కొన్నారు. ఈ కారు రిజిస్ట్రేషన్ కోసం నేడు ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ కి వచ్చారు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ బ్లాక్ టి-షర్ట్ లో కాలింగ్ గ్లాస్సెస్ తో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. కాగా కొత్తగా కొన్న కారు కలర్ ‘నౌటిక్ బ్లూ’లా కనిపిస్తుంది.. ఇక కారు మోడల్ విషయానికి వస్తే.. Mercedes-Benz Maybach S-Class S 580. మార్కెట్ లో దీని విలువ దాదాపు రూ.2.72 కోట్లు చూపిస్తుంది. కాగా ఎన్టీఆర్ దగ్గర ఇప్పటికే చాలా కార్లు ఉన్నాయి. వాటిల్లో చాలా వరకుకోటి రూపాయలకు పైగా రేట్ ఉన్నవే అని సమాచారం. మోడల్ కార్లు ఎన్టీఆర్ దగ్గర ఉన్నట్లు సమాచారం. ఇక దేవర విషయానికి వస్తే.. ఇటీవలే గోవాలో ఓ షెడ్యూల్ ని పూర్తి చేసారు. అక్కడ ఎన్టీఆర్ పై ఓ సాంగ్‌ని, కొన్ని ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించారు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుంది.
మొదటి పార్టుని దసరా సమయంలో అక్టోబర్ 10న రిలీజ్ చేయబోతున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్, శృతి మరాఠే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ విలన్‌గా, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, మురళీ శర్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.