సీనియర్ నరేశ్ హీరోగా ‘మళ్లీ పెళ్లి’ సినిమా రూపొందింది. విజయ్ కృష్ణ బ్యానర్లో నరేశ్ నిర్మించిన ఈ సినిమాకి, ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించాడు. నరేశ్ సరసన నాయికగా పవిత్ర లోకేశ్ నటించిన ఈ సినిమా, ఈ నెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో జయసుధ ముఖ్య అతిథిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో జరిగింది. గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ‘మళ్ళీ పెళ్లి’ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. యూనిక్ కథ తో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో పవిత్ర లోకేష్ కథానాయికగా నటిస్తోన్న విషయం తెలిసిందే.

జయసుధ మాట్లాడుతూ .. ‘పండంటి కాపురం’ సినిమాతోనే నన్ను .. నరేశ్ ను విజయనిర్మల గారు పరిచయం చేశారు. ఆ తరువాత అటు నరేశ్ హీరో అయ్యాడు .. ఇటు నేను హీరోయిన్ అయ్యాను. ఇద్దరం కూడా మంచి ఆర్టిస్టులుగా పేరు తెచ్చుకున్నాం. విజయనిర్మల గారికి మేము ఇచ్చిన గిఫ్ట్ అదే. గతంలో నరేశ్ తో మా బ్యానర్లో మేము ‘అదృష్టం’ అనే సినిమాను కూడా తీయడం జరిగింది” అని అన్నారు.

“విజయ్ కృష్ణ బ్యానర్ 50 ఏళ్లను పూర్తిచేసుకుంది .. అలాగే కెరియర్ పరంగా మేము కూడా 50 ఏళ్లను పూర్తిచేసుకోవడం .. ఇప్పుడు మళ్లీ ఇదే బ్యానర్లో కలిసి నటించడం విశేషం. ఇక ఎమ్మెస్ రాజుగారి నిర్మాణంలోనూ .. దర్శకత్వంలోను నేను నటించాను. ఆయన ఆలోచనా విధానం చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా తీసే ధైర్యం నరేశ్ కి ఉంది .. ఎవరి పోరాటం వారిది .. ఉన్నది ఒక్కటే జీవితం .. ఇక్కడ భయపడటానికేం లేదు” అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇది చూసిన నెటిజన్లు వీళ్లిద్దరికీ మద్దతు పెరుగుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొన్న మహేష్ బాబు కూడా వీళ్లిద్దరి బంధానికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు నరేష్ చెప్పిన విషయం తెలిసిందే.