Yamini Swetha : నితిన్ హీరోగా నటించిన జయం సినిమా గుర్తుంది కదా .. అప్పట్లో సెన్సేషన్ సృష్టించిన సినిమా. ఆ సినిమాలో నితిన్ కు జోడిగా సదా హీరోయిన్ గా నటించింది. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అందరి కెరీర్ కు గట్టి పునాది అనే చెప్పుకోవాలి. ఈ మూవీ ఆరోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరి క్యారెక్టర్ అందరినీ తెగ ఆకట్టుకుంది. ముఖ్యంగా సదా చెల్లిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ తన నటనతో ఎంతో మంది మనసు కొల్లగొట్టింది. అందుకే ఇప్పటికీ ఆమె అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. దీంతో ఈ బ్యూటీకి సంబంధించిన ఏ న్యూస్ వచ్చినా సరే ఆసక్తిగా చదువుతుంటారు.

జయం సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్ పేరు యామినీ శ్వేత నాయుడు. ప్రస్తుతం ఆమెను చూస్తే చాలా మంది తప్పకుండా షాక్ అవుతారు. యామిని ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తాజాగా ఈ అమ్మాయికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. యామిని పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వడమే కాకుండా ఆమెకు పిల్లలు కూడా ఉన్నారు. అయితే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండా చదువు పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. చదువు పూర్తి అయ్యాక తన పేరెంట్స్ చూసిన అబ్బాయిని యంగ్ ఏజ్ లోనే పెళ్లి చేసుకుంది.. భర్తతో పాటు యామిని శ్వేతా నాయుడు ఫారిన్ లో సెటిల్ అవ్వడమే కాకుండా ఓ పాప కూడా జన్మనిచ్చినట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలు, న్యూస్ షేర్ చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ నటి తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అందులో తన భర్త, పాపతో కనిపించింది. ఇక ఇది చూసిన వారందరూ మీ అక్కకు ఇంకా పెళ్లి కాలేదు, అప్పుడే చెల్లి పెళ్లి చేసుకుని పిల్లలను కూడా కనేసిందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram