Janhvi Kapoor : ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం ఎంతగా పెరిగిపోయిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచం నలుమూలల జరిగిన విషయాలు కూడా సెకన్లలో వైరల్ అయిపోతున్నాయి. ఇక సెలబ్రిటీలు కూడా తమ అభిమానులకు నిత్యం అందుబాటులో ఉండేందుకు సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. సెలబ్రిటీలు, సినీ తారలకు మంచి గుర్తింపు తేవడంలో సోషల్ మీడియా కీలకపాత్ర పోషిస్తుంది. అందుకనే ప్రతి ఒక్కరూ ఇన్‌స్టా, ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ ఛానల్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లలో అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. అయితే అభిమాన హీరో హీరోయిన్ల బాడీ ఇమేజింగ్, గ్లామర్ వంటివి అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచుతుంటాయి. దీంతో వారు కూగా అభిమానుల కోసం బోల్డ్ ఫొటోలు షేర్ చేస్తుంటారు.

కానీ మరీ అశ్లీలంగా ఫోటోలు ఏ హీరోయిన్లు దాదాపు షేర్ చేయరు. కానీ తాజాగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పేరు ఇలాంటి పని చేసిన నెటిజన్ల చేత బండబూతులు తిట్టించుకుంది. ఆమె పేరుతో ఉన్న ఎక్స్ ఖాతాలో అశ్లీల దృశ్యాలు ఉండటంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే జాన్వీ కపూర్ పేరుతో ఉన్న ట్విట్టర్ వేదికగా అశ్లీల చిత్రాలు కనిపించడం, నెటిజన్ల నుంచి విమర్శలు రావడంతో ఎట్టకేలకు జాన్వీ కపూర్ టీం స్పందించింది. జాన్వీకి అసలు ట్విటర్ ఎకౌంటే లేదని, సోషల్ మీడియాలో ఆమె పేరుతో ఉన్నది ఫేక్ అకౌంట్ అని తేల్చేసింది. ఇలాంటి నకిలీ ఖాతాలు, నకిలీ సమాచారంతో అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వచ్చిన సమాచారాన్ని వెంటనే నమ్మేయకుండా నిజనిజాలు తెలుసుకోవాలని జాన్వీ టీమ్ అభిమానులకు విజ్ఞప్తి చేసింది.
ఇక జాన్వీ దివంగత అతిలోకసుందరి శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. స్టార్ కిడ్ అనే మార్క్ పెట్టుకుని బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న దేవర మూవీలో నటిస్తోంది. ఇటీవల జాన్వీ పలు వెబ్ సిరీస్‌లు, కమర్షియల్ యాడ్స్, ప్రమోషన్స్ కోసం ఎక్కువ కూడా టైమ్ స్పెండ్ చేస్తూ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ ఉన్న సెలబ్రిటీగా మారిపోయింది.