Janhvi kapoor : ప్రియుడితో కలిసి వచ్చి పట్టు పరికిణిలో శ్రీవారికి సాష్టాంగ నమస్కారం చేసిన జాన్వి కపూర్..

- Advertisement -

Janhvi kapoor : అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వి కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తోంది. ఇక త్వరలోనే తారక్ తో కలిసి టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వనుంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ శిఖర్ పహరియాతో లవ్ ట్రాక్ నడుపుతున్న సంగతి తెలిసిందే.. వీరిద్దరి పెళ్ళికి బోనీ కపూర్ కూడా ఒప్పుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా వీళ్ళిద్దరూ తిరుమల తిరుపతి దేవస్థానం లో కనిపించడం విశేషం.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

Janhvi kapoor
Janhvi kapoor

జాన్వి కపూర్ కి తన తల్లి శ్రీదేవి లాగే భక్తి కూడా ఎక్కువ. జాన్వి తరచుగా వివిధ ఆలయాలను సందర్శించడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఆరు నెలలకు ఒకసారి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తూనే ఉంటుంది కొన్ని నెలల క్రితం కాలినడకన తిరుమలకు వచ్చిన జాహ్నవి శ్రీదేవిని దర్శించుకుని వెళ్ళింది. శ్రీదేవికి తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ఓ సెంటిమెంట్.. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను జాన్వీ కపూర్ కూడా ఫాలో అవుతుంది.

Actress Janhvi kapoor
Actress Janhvi kapoor

తాజాగా మరోసారి జాన్వి కపూర్ తిరుమలని సందర్శించింది. కాకపోతే ఈసారి మరో ప్రత్యేకత ఉంది. జాన్వి కపూర్ తన ప్రియుడు శిఖర్ పహరియాతో కలిసి తిరుమలకు వచ్చింది. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో జాహ్నవి కపూర్ శిఖర్ శ్రీవారిని దర్శించుకుని భక్తిపార్వశ్యంలో మునిగిపోయారు. ఆలయ అధికారులు వీరికి ఘనంగా స్వాగతం పలుకగా.. అర్చకులు ఆశీర్వాదం అందించి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం జాన్వి కపూర్ శ్రీవారి ఆలయం ఎదుట సాష్టాంగ నమస్కారం చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.‌ ఎంతో భక్తి శ్రద్ధలతో జాన్వీ కపూర్ తిరుమల లో కనిపించింది.

- Advertisement -

సంప్రదాయబద్ధంగా పట్టు పరికిణీలో తళ్ళుక్కున మెరిసింది. తన వెనుకాలే ఆమె ప్రియుడు శిఖర్ పంచ కట్టు, కండువాలో కనిపించడు. జాన్వీ, శిఖర్ ఇద్దరూ పక్క పక్కనే నడుస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here