Janhvi Kapoor : మా అమ్మ వల్ల నెలరోజులు బాధపడ్డాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన జాన్వీ

- Advertisement -

Janhvi Kapoor : అల‌నాటి తార‌, దివంగ‌త న‌టి శ్రీ‌దేవి-బాలీవుడ్ బ‌డా నిర్మాత బోనీ క‌పూర్ కుమార్తె జాన్వీ క‌పూర్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బాలీవుడ్ లో ఇప్ప‌టికే అర డ‌జ‌న్ చిత్రాల్లో న‌టించిన ఈ మ‌ద్దుగుమ్మ‌కు ఇంత వ‌ర‌కు స‌రైన హిట్ ప‌డ‌లేదు. కానీ, సోష‌ల్ మీడియాలో గ్లామ‌ర‌స్ ఫోటో షూట్ల‌తో జాన్వీ కావాల్సినంత క్రేజ్ ను సంపాదించుకుంది. అన్న‌ట్లు త్వ‌ర‌లోనే ఈ అందాల సోయ‌గం తెలుగు తెర‌కు పరిచ‌యం కాబోతోంది.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేష‌న్ లో ప్ర‌స్తుతం దేవ‌ర అనే పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ క‌పూర్ ఎంపిక అయింది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. అలాగే బాలీవుడ్ లోనూ ప‌లు ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉన్న జాన్వీ క‌పూర్‌.

Janhvi Kapoor
Janhvi Kapoor

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకుంది. ఈ క్ర‌మంలోనే త‌న త‌ల్లి మ‌ర‌ణం గురించి త‌లుచుకుంటూ ఎమోష‌న‌ల్ అయింది. జాన్వీ క‌పూర్ త‌న డెబ్యూ మూవీ ధ‌డ‌క్ షూటింగ్ స‌మ‌యంలోనే శ్రీ‌దేవి మ‌ర‌ణించింది. అయితే అమ్మ మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక‌పోయాన‌ని.. ఆమె లేని లోటు ఎవ్వ‌రు తీర్చ‌లేనిద‌ని జాన్వీ చెప్పుకొచ్చింది.

- Advertisement -

ఆ నెల మొత్తం అమ్మ లేరు అన్న బాధ‌ను భ‌రించ‌లేక‌పోయాను. నాకు ఏమీ అర్థం కాలేదు. ఏదో ఒక ప‌ని చేస్తూ ముందుకు సాగ‌డం క‌ష్టంగా అనిపించింది. ఆ బాధ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు పెద్ద యుద్ద‌మే చేశాను అంటూ జాన్వీ వాపోయింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Varun Dhawan
జాన్వీ క‌పూర్‌

ఇక మరోవైపు జాన్వీ కపూర్​ ‘బవాల్’​ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ ప్రమోషన్స్​లో భాగంగా ఈ బ్యూటీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమాలో స్టూడెంట్​ ఆఫ్​ ది ఇయర్​ ఫేమ్​ వరుణ్​ ధావన్​ తో జాన్వీ జోడీకట్టింది. అయితే, సినిమా షూటింగ్​ సమయంలో ఓ ఇంట్రెస్టింగ్​ సీన్​ జరిగిందట. వరుణ్​ ధావన్​ జాన్వీతో కలిసి నటించడం ఇదే మొదటి సారి. దీంతో సెట్​లో వీరిద్దరూ కలిసిపోతారని మూవీ టీం భావించింది.

కానీ, వరుణ్​ జాన్వీని అవాయిడ్​ చేసేవాడట. తను మాట్లాడే ప్రయత్నం చేసినా పెద్దగా కలిసేవాడు కాదట. ఇలా నెల రోజుల వరకు జరిగింది. ఈ విషయాన్ని ఈ హీరో స్వయంగా చెప్పాడు. సినిమాల్లో వీరి పాత్రల స్వభావం ప్రత్యేకంగా ఉంటుందట. చలాకీ వ్యక్తులైన వీరిద్దరూ ఒక చోట చేరితే మంచి స్నేహితులైపోతారు.. అప్పుడు తమ నటనపై ఆ ఎఫెక్ట్​ ఉంటుందని హీరో భావించాడట. అందుకే జాన్వీ ఏమనుకున్నా పరవాలేదనుకుని తనను దూరం పెట్టినట్టు చెప్పాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here