Janhvi Kapoor : అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్హీరోయిన్గా ఎదిగేందుకు అందివచ్చిన అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటుంది. త్వరలోనే మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాతో అభిమానుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఆమె వరుస ఈవెంట్లలో పాల్గొంటుంది. తాజాగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్రిలీజ్ చేశారు.

అందాల ముద్దుగుమ్మ జాన్వీకపూర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంటారు. ఇక ప్రస్తుతం తాను తెలుగు నాట కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కొరటాల శివ, దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న దేవర సినిమాలో చేస్తుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇండస్ట్రీకి చెందిన శ్రీదేవి, బోనీ కపూర్ కూమార్తెను అయినప్పటికీ తనను అవమానించకుండా ఉండలేదంటూ సంచలన కామెంట్స్ చేసింది.
13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తన ఫోటోలని ఫోర్న్ సైట్‌లో పెట్టి దుష్ప్రచారం చేశారని చెప్పింది. కొందరు ఆకతాయిలు నా ఫోటోలని పోర్న్ సైట్ లో పెట్టారు. శ్రీదేవి కూతురు ఎంత హాట్ గా ఉందో చూడండి అంటూ వైరల్ చేశారు. ఆ ఫోటోలని నా స్నేహితులు కూడా చూశారు. నేను స్కూల్ కి వెళితే ఎంతో హేళనగా మాట్లాడే వారు. ఆ వయసులో వాటి గురించి నాకు పెద్దగా అవగాహన కూడా లేదు. నన్ను ఎందుకు ఎగతాళి చేస్తున్నారో, ట్రోల్ చేస్తున్నారో అర్థం అయ్యేది కాదు, వాళ్ల చేష్టలకు ఎమోషనల్ కూడా అయ్యాను . అప్పటి విమర్శలు, ట్రోలింగ్ వల్లే నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను. ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురు అవుతే నేను భరించగలుగుతాను, కానీ నా ఫ్యామిలీని ట్రోల్ చేస్తే మాత్రం సహించలేనంటూ చెప్పుకొచ్చింది జాన్వీ. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.