Janhvi Kapoor.. తన ఫ్యాషన్ సెన్స్ తో అభిమానులను మెస్మరైజ్ చేయడంలో ఈ బ్యూటీకి సాటి ఎవరూ లేరు. హాలీవుడ్ హీరోయిన్స్ కు సైతం ఈ భామ టఫ్ కాంపిటీషిన్ ఇస్తోంది. వెస్టర్న్ వేర్ అయినా.. బోల్డ్ ఔట్ ఫిట్స్ అయినా.. సంప్రదాయ చీరకట్టు అయినా జాన్వీని బీట్ చేసే హీరోయిన్ ఎవరూ లేరు. ఈ మధ్య ఈ బ్యూటీ ఫ్యాషన్స్ సెన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ భామ ఏ డ్రెస్ వేసినా అతిలోక సుందరిలా కనిపిస్తోందని అంటున్నారు.
తాజాగా జాన్వీ కపూర్ రెడ్ శారీలో కనిపించింది. ఎర్రచీర.. పచ్చరైకతో తెలుగు ఆడపిల్ల వైబ్స్ ఇచ్చింది. చీరకట్టులో జాన్వీ చాలా చాలా అందంగా కనిపించింది. ఈ చీరలో చేసిన ఫొటోషూట్ లో జాన్వీ తన తల్లి, శ్రీదేవిని తలపించింది. ముఖ్యంగా ఈ బ్యూటీ ఇచ్చిన కొన్ని పోజులు, ఎక్స్ ప్రెషన్స్ అచ్చం శ్రీదేవిలాగే ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు.
ఎర్ర రంగ చీరలో జాన్వీ తెలుగుంటి ఆడపడుచులా కనిపించింది. చీరకు సరైన జ్యువెల్లరీ ధరించి ఓ దశలో పెళ్లికూతురిలా కనిపించింది. జాన్వీ ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ భామ ఫ్యాషన్ డిజైనర్ ఎవరో కానీ.. సూపర్ గా పని చేస్తోందని అంటున్నారు.
ఈమె ఏ డ్రెస్ వేసినా సరిగ్గా యాప్ట్ అవుతుందని అంటున్నారు. జాన్వీ ఫ్రేమ్ లోకి వచ్చిందంటే.. గిగి, బెల్లా హెడిడ్ లు కూడా సైడ్ అయిపోవాల్సిందేనంటూ హాలీవుడ్ మోడల్స్ తో జాన్వీని పోల్చేస్తున్నారు.సోషల్ మీడియాలో ప్రస్తుతం జాన్వీ ఫొటోలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
శ్రీదేవి జీన్స్ మొత్తం జాన్వీకి ట్రాన్స్ ఫర్ అయిపోయాయని అంటున్నారు. శ్రీదేవి లేని లోటును ఓ రకంగా జాన్వీ తీర్చేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యాషన్ సెన్స్ లోనూ.. సినిమాలు సెలక్ట్ చేసుకోవడంలోనూ జాన్వీ తన తోటి స్టార్ కిడ్స్ కు టఫ్ కాంపిటీషిన్ ఇస్తోందని అంటున్నారు.