Janhvi Kapoor : నిమిషానికి కోటి రూపాయిలు డిమాండ్ చేస్తున్న జాన్వీ కపూర్!

- Advertisement -

Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ కి ఇప్పటి వరకు బాలీవుడ్ లో సరైన సూపర్ హిట్ లేకపోవడం విశేషం. ఈమె తర్వాత ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రతీ ఒక్కరు సక్సెస్ అవ్వగా, జాన్వీ కపూర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారైంది. నటన, అందం కావాల్సినంత ఉన్నప్పటికీ కూడా, సరైన స్క్రిప్ట్స్ ఎంచుకోవడం లో విఫలం అవ్వడంతో ఆమెకి ఇప్పటి వరకు సక్సెస్ రాలేదు. ప్రస్తుతం ఆమెకి బాలీవుడ్ లో ఎలాంటి మార్కెట్ లేదు కాబట్టి, ఆమె కోరినంత రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు ఎవ్వరూ సిద్ధంగా లేరు.

Janhvi Kapoor
Janhvi Kapoor

కానీ తెలుగు లో మాత్రం ఈమెకి ఉన్న డిమాండ్ మామూలుది కాదు. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘దేవర’ చిత్రం ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టబోతున్న జాన్వీ కపూర్, ఈ చిత్రానికి ఏకంగా 5 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుందని టాక్. ఈ చిత్రం తో పాటు త్వరలో రామ్ చరణ్ – బుచ్చి బాబు కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రంలో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకి కూడా ఆమె ఇదే రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇది ఇలా ఉండగా బాలీవుడ్ లో ఈమె పలు చిత్రాలలో స్పెషల్ గెస్ట్ గా నటించింది. కొన్ని సినిమాల్లో ఐటెం సాంగ్స్ కూడా చేసింది.

Janhvi Kapoor says she 'learnt nothing' in LA acting school, feels she should have spent those years learning about India | Bollywood News - The Indian Express

- Advertisement -

కానీ అక్కడ ఈమెకి ఎవ్వరు కూడా కోటి రూపాయలకు మించి రెమ్యూనరేషన్ ఐటెం సాంగ్స్ కి ఇచ్చేవారు కాదు. కానీ ఇక్కడ ఆమె ఏకంగా నాలుగు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తుందట. రీసెంట్ గానే ఒక స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేసేందుకు అంగీకరించిన ఈమె, ఏకంగా నాలుగు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసిందట. అంటే నాలుగు నిమిషాల పాటకు లెక్కేస్తే నిమిషానికి కోటి రూపాయిలు అన్నమాట. ప్రస్తుతం ఆమెకి క్రేజ్ కూడా బాగా ఉండడం తో దర్శక నిర్మాతలు ఎంత అడిగితె అంత ఇచ్చేందుకు సిద్ధం అయిపోయారట. ఒక్క హిట్ కూడా తన ఖాతాలో లేనప్పుడే ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందంటే, ఇక ఈమె హిట్ ట్రాక్ లోకి పడితే ఏ రేంజ్ లో రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తుందో ఊహించుకోవచ్చు.

Janhvi Kapoor reveals her ideal wedding plans

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here