శ్రీదేవికి ఏమాత్రం తీసిపోని జాన్వీ కపూర్.. కొత్త కండీషన్స్ పెడుతున్న బాలీవుడ్ భామ

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో జాన్వీ కపూర్ ఎంట్రీ గురించి ఇప్పటికే ఎన్నో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. జాన్వీ కపూర్ సైతం తనకు తెలుగు సినిమాలపై ఆసక్తి ఉందని పలు సందర్బాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్30 సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అయితే జాన్వీ కపూర్ నిర్మాతలకు షాకింగ్ కండీషన్లు పెడుతున్నారని సమాచారం అందుతోంది. జాన్వీ కపూర్ షరతులు విన్న నిర్మాతలు ఈమెతో సినిమాలు తీయడం తేలిక కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం అందుతోంది.

జాన్వీ కపూర్
జాన్వీ కపూర్

మరి ఈ షరతులకు ఒప్పుకుని సినిమాలను తీసే నిర్మాతలు ఉంటారా? అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జాన్వీ కపూర్ ఒక్కో సినిమాకు 4 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ సినిమాతో ఎంట్రీ ఇస్తే జాన్వీ కపూర్ రేంజ్ మారిపోతుందని జాన్వీ కపూర్ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోవడం ఖాయమని కొంతమంది చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.

Janhvi kapoor

అలాగే కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర (Devara) సినిమాలో హీరోయిన్ పాత్రని మధ్య లోనే చనిపోయేదిగా రాసుకున్నారట. కానీ ఈ విషయం తెలిసి జాన్వీ కపూర్ తన పాత్ర అలా చనిపోకూడదని,సినిమా మొత్తం తన పాత్ర ఉండేలా చూడమని, స్క్రిప్ట్ మొత్తం మార్చేయమని కండిషన్ పెట్టిందట. ఇక దీనికి ప్రధాన కారణం జాన్వీ కపూర్ తెలుగులో నటించే మొదటి సినిమా ఇది. మొదటి సినిమాలోనే తాను చనిపోయే పాత్రలో నటించడం తనకి అంతగా నచ్చలేదట.అందుకే కొరటాల శివకి ఈ కండిషన్ పెట్టినట్టు తెలుస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here