LEO : తమిళ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘లియో ‘ బాక్స్ ఆఫీస్ వద్ద టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు నుండి రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కేవలం నాలుగు రోజుల్లోనే 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించిన ఈ సినిమా కొన్ని చోట్ల బ్లాక్ బస్టర్ జైలర్ మూవీ క్లోసింగ్ కలెక్షన్స్ ని కూడా దాటేసింది.
ఫ్లాప్ టాక్ తోనే ఈ స్థాయి బాక్స్ ఆఫీస్ వసూళ్లు అంటే, సెకండ్ హాఫ్ అనుకున్న రేంజ్ లో డైరెక్టర్ లోకేష్ తీసి ఉంటే ఈ సినిమా రేంజ్ ఎక్కడ దాకా వెళ్లి ఆగేదో ఎవ్వరూ ఊహించని విధంగా ఉండేదని, వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. ముఖ్యంగా తమిళనాడు ప్రాంతం లో వసూళ్ల ప్రవాహం మరో వారం రోజులు కొనసాగేలా ఉంది.
తమిళనాడు ఇప్పటి వరకు నాలుగు రోజులకు కలిపి వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. ఇక 5 వ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే జైలర్ మొదటి రోజు వసూళ్లకంటే ఎక్కువ ఉంది. ఇదే ఊపు ని మరో మూడు రోజులు కొనసాగిస్తే మొదటి వారం లోనే ఈ సినిమా జైలర్ తమిళనాడు క్లోసింగ్ కలెక్షన్స్ కి దగ్గరగా వెళ్లేలా కనిపిస్తుంది. ఓవర్సీస్ లో అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకి 150 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
జైలర్ చిత్రానికి ఈ ప్రాంతం లో క్లోసింగ్ కలెక్షన్స్ 180 కోట్ల రూపాయిలు మాత్రమే. అంటే ఫుల్ రన్ లో లియో చిత్రం 220 కోట్లు కచ్చితంగా రాబట్టే ఛాన్స్ ఉందన్నమాట. కర్ణాటక లో పాతిక కోట్లు, కేరళ లో 30 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో 32 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టిన ఈ సినిమా మొత్తం మీద నాలుగు రోజులకు గాను 350 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.