ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా సూపర్ స్టార్ రజినీకాంత్ మేనియా నే కనిపిస్తుంది. ఆయన హీరో గా నటించిన ‘జైలర్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామి ని సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది. చాలా కాలం నుండి సరైన బ్లాక్ బస్టర్ హిట్స్ లేక ఇబ్బంది పడుతున్న రజినీకాంత్ కి ఈ చిత్రం ఇచ్చిన బూస్ట్ మామూలుది కాదు. ఆయన గత చిత్రం ‘అన్నాతే’ క్లోసింగ్ కలెక్షన్స్ కేవలం 150 కోట్ల రూపాయిల గ్రాస్ మాత్రమే.

కానీ జైలర్ కి మొదటి రోజే 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక రెండవ రోజు కూడా అదే రేంజ్ ఊపు ని కొనసాగించింది. ఒక మామూలు యావరేజి సినిమాకి ఈ స్థాయి వసూళ్లు వస్తాయని బహుశా మేకర్స్ కూడా ఊహించి ఉండరు, ఇదంతా కేవలం సూపర్ స్టార్ రజినీకాంత్ మ్యాజిక్ అనే చెప్పాలి. ఇక మొదటి రెండు రోజులకు కలిపి ఈ సినిమా ఎంత వసూళ్లు వస్తాయో ఒకసారి చూద్దాం.

ముందుగా తెలుగు లో ఈ చిత్రాన్ని 12 కోట్ల రూపాయలకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేసాడు. మొదటి రోజు 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, రెండవ రోజు మూడు కోట్ల రూపాయిలు , మూడవ రోజు నాలుగు కోట్ల రూపాయిలు వచ్చాయి. అంటే పెట్టిన డబ్బులకు రెండు కోట్ల రూపాయిలు అదనంగా లాభాలు వచ్చాయి అన్నమాట. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 200 కోట్ల రూపాయిల గ్రాస్ ని కేవలం మూడు రోజుల్లోనే రాబట్టింది.

అంటే షేర్ వసూళ్లు వంద కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది అన్నమాట. గత చిత్రాలను చూసి రజినీకాంత్ ని బాగా తక్కువ అంచనా వేసినా కొంతమంది విశ్లేషకులకు ఈ ‘జైలర్‘ చిత్రం ఒక చెప్పు దెబ్బ లాంటిది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాబొయ్యే రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని అద్భుతాలు సృష్టించబోతుందో చూడాలి.
