Faima : జబర్ధస్త్ ఫైమా.. ఈ పేరుతో పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ ముద్దుగుమ్మ ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి బుల్లితెరపై సెన్సేషన్ అయిపోయింది. ఫలితంగా వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ కొనసాగుతోంది. జబర్ధస్త్ షోలో తనదైన మార్క్ కామెడీని పండిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ముగ్గురు మగాళ్ల జీవితాలతో ఆడుకుందని ఓ కమెడియన్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఫైమా ‘పటాస్’ షో ద్వారా వెలుగులోకి వచ్చింది. అందులో తనదైన శైలి కామెడీతో అలరించి జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో తన టాలెంట్‌ను చూపించి సత్తా చాటింది. ఫలితంగా ఫైమాకు ఆఫర్లు క్యూ కట్టాయి. ఇలా ఇప్పటికే ఎన్నో షోలు, ఈవెంట్లలో భాగమై బుల్లితెర స్టార్ కమెడియన్ గా ఎదిగిపోయింది. ఇదే ఫేమ్‌తో ఆమెకు బిగ్ బాస్‌లో పాల్గొనే ఛాన్స్ కూడా దక్కింది. అక్కడ కూడా అందరినీ నవ్విస్తూ తనేంటో నిరూపించుకుని స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంది. ఆ తర్వాత స్టార్ మా షో లో కూడా అలరించింది. మళ్లీ ‘జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చి అదే జోరు కొనసాగిస్తోంది.
అయితే ఫైమా కమెడియన్ ప్రవీణ్ ను ప్రేమిస్తున్నానన్న విషయాన్ని బిగ్ బాస్ షోలో రివీల్ చేసింది. ఏమైందో ఏమో కానీ ఇటీవల వీరిద్దరూ విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై రియాక్ట్ అయిన ఫైమా తమ జోడీ జస్ట్ షో వరకు మాత్రమేనంటూ చెప్పుకొచ్చింది. కానీ ప్రవీణ్‌తో తనకు రిలేషన్ ఉందో లేదో అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం ఈ అమ్మడుకు సంబంధించిన మరో వీడియో ఒకటి నెట్టింట్లో తెగ రచ్చ చేస్తుంది. ఆ వీడియోలో ఫైమా, మరో అబ్బాయి ఉన్నారు. వీరిద్దరు నలుపు రంగు టీ షర్ట్ , షార్ట్ ధరించి ఉండగా.. ఆ వ్యక్తితో చాలా చనువుగా ఉంటూ ‘ప్రేమ పొంగెనే’ అనే క్యాప్షన్‌తో ఓ వీడియోను ఫైమా పోస్ట్ చేసింది. అది చూసిన నెటిజన్లు ప్రవీణ్‌ను ఒదిలేశావా, కొత్త లవర్ ఆ అంటూ తిడుతూ కామెంట్స్ పెడుతున్నారు.
View this post on Instagram