బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న కమెడియన్స్ లో రాకింగ్ రాకేష్ ఒకరు. కొన్నేళ్ళ వరకు సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎంతగానో ప్రయత్నాలు జరిపిన రాకేష్ మిమిక్రి ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు అందుకున్నాడు. అలాగే ఈవెంట్స్ లో కూడా అతను కామెడీ స్కిట్స్ చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించాడు. ఇక ఫైనల్ గా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనంతరం అతని జీవితం మారిపోయింది. రాకింగ్ రాకేష్ కొన్నాళ్ల క్రితం జోర్దార్ సుజాతతో పెళ్లి బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.

తాజాగా సుజాత నటించిన ‘సేవ్ ది టైగర్’ సిరీస్ తో అలరించింది. తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లవ్ స్టోరీ, కెరీర్ గురించి పంచుకుంది. ఇక వాళ్లిద్దరి లవ్ స్టోరీ ఇంత త్వరగా ముందుకు సాగడానికి పెళ్లి త్వరగా అయిపోడానికి కారణం రోజా గారు అంటూ తెలిపారు. ఆమె మొదట కనిపెట్టేసారు రాకేష్ నేను ప్రేమించుకుంటున్నాం అని అంటూ చెప్పారు. ఇక వాళ్లు ప్రేమించుకునే సమయంలో చాలా మంది వాళ్లను విడదీయాలని చూశారంటూ కామెంట్స్ చేశారు. ఒకరిపై మరొకరికి చెప్పి దూరం పెంచాలని చాలా మంది చూశారని చెప్పింది.

నెగిటివ్ గా తన గురించి చెప్పడం లాంటివి చేసారు అంటూ ఎమోషనల్ అయ్యారు సుజాత. ఇక తాను నా లైఫ్ లో లక్కీ పర్సన్ అని తాను లైఫ్ లోకి వచ్చినప్పటి నుండి నాకు లక్ మొదలయిందంటూ జోర్దార్ సుజాత తెలిపారు. వాళ్లిదరి లవ్ స్టోరీ గురించి మాట్లాడుతూ అసలు ఎవరు ప్రపోజ్ చేసుకున్నామో తెలియదు, ఇద్దరం మొదటి నుండి మంచి స్నేహితులం అంటూ సుజాత తెలిపింది. రాకేష్ కి పెళ్లి మీద ఇంట్రస్ట్ లేకపోతే ఎన్నో సార్లు ఒక స్నేహితురాలిగా పెళ్లి చేసుకో ఒంటరిగా ఉండలేవు ఒక ఏజ్ వచ్చాక అంటూ సలహా ఇచ్చారట సుజాత.