జబర్దస్త్ పంచు ప్రసాద్ గురించి అందరికి తెలుసు.. అతని నాన్ సింక్ పంచులతో అందరిని కడుపుబ్బా నవ్వించ్చాడు… ఎన్నో ఏళ్లుగా షోలో కనిపిస్తూ అందరి మనసును దోచుకున్నాడు.. అలాంటి పంచు ప్రసాద్ ఇప్పుడు తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు.. గత కొంతకాలంగా కిడ్నీ సమస్య వేధిస్తోంది.పంచ్ ప్రసాద్ గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతడు కిడ్నీ సంబంధిత సమస్యను ఎదుర్కొంటున్నాడు. దీనికోసం రెగ్యులర్గా డయాలసిస్ చేయించుకుంటున్నాడు..
అయితే ఆయన ఆరోగ్యంలో ఎటువంటి మార్పు లేదు.. మళ్లీ అతనిని ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. అతి త్వరలో ఆపరేషన్ చేయాలని చెబుతున్నారు. అందుకోసం ఆర్దికంగా సాయం కావాలంటూ తోటి నటుడు ఇమ్మాన్యుయేల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.. అన్నకు సీరియస్ గా ఉంది. డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పారు. దానికి చాలా ఖర్చు అవుతుంది. మేం అంతా ట్రై చేస్తున్నాం. మీరు కూడా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని ఇమ్మాన్యుయేల్ పోస్ట్ చేశారు.
ఆ పోస్టులో ప్రసాద్ భార్య సునీత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. దాతల నుంచి సాయం కోరుతూ ఈ పోస్ట్ లో పేర్కొన్నాడు..ప్రసాద్ కిడ్నీ సమస్య తిరగబెట్టడంతో ఏకంగా నడవలేని స్థితికి చేరుకున్నారు. షూటింగ్ నుంచి ఇంటికి వెళ్లిన ప్రసాద్ జ్వరంతో పాటు నడవలేక బాధపడటంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పుడు పరీక్షలు చేసి కిడ్నీ సమస్య మరింత తీవ్రతరమైందని డాక్టర్లు చెప్పారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..