Jabardasth Faima : ఆ ప్రాబ్లమ్ వల్లే ప్రవీణ్‌తో బ్రేకప్ అయ్యాను.. రీజనేంటో చెప్పిన ఫైమా

- Advertisement -

Jabardasth Faima: ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం. అక్కడకు వెళ్లాలని సెలబ్రిటీలుగా మారాలని ఎందరో కలలు కంటారు. కొందరు అందుకోసం శాయశక్తులా శ్రమిస్తారు. అనుకున్నది సాధిస్తారు. కొందరు ఆ కష్టం పడలేకనో అదృష్టం కలిసి రాకనో ఇండస్ట్రీకి దూరమవుతారు. బుల్లితెర అయినా.. వెండితెర అయినా సాధారణంగా ఇండస్ట్రీ అనేది పురుషాధిక్య ప్రపంచం అన్న సంగతి అందరికీ తెలసిందే. ముఖ్యంగా తెలుగు బుల్లితెరపై మేల్ కమెడియన్ల ఆధిపత్యం కొనసాగుతుంది. చాలా అరుదుగా కొందరు లేడీ కమెడియన్స్ బుల్లి తెరపై తమ సత్తా చాటుతున్నారు. తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో ఫైమా ముందు వరుసలో ఉంటుంది. ప‌టాస్ షోతో బుల్లితెరకు పరిచయమైంది ఈ కామెడీ క్వీన్.. జబర్దస్త్ కామెడీ షో తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 

- Advertisement -

 

తనదైన కామెడీ పంచ్ డైలాగులు, ప్రాసలతో బుల్లి తెర ప్రేక్షకులను బాగా దగ్గరైంది. ముఖ్యంగా పటాస్ ప్రవీణ్ తో ఫైమా చేసిన స్కిట్లు బుల్లితెర ఆడియెన్స్ ను బాగా నవ్వించాయి. అయితే ఆన్‌స్క్రీన్‌లో జంటగా కనిపించే ఫైమా, ప్రవీణ్ రియల్ లైఫ్‌ లోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టే వీరిద్దరూ కలిసి ఇన్ స్టాలో రీల్స్ చేయడం, పోస్ట్‌ లు షేర్ చేసుకోవడం, ఒకరికొకరు గిఫ్టులు ఇచ్చిపుచ్చుకోవడంలో వారిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ ఉందని జనాలు నమ్మేశారు. అయితే ఇంతలోనే ప్రవీణ్ ఓ షాకింగ్ విషయం చెప్పేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్ ప్రవీణ్ ఫైమా తన ప్రేమను తిరస్కరించిందని చెప్పాడు. ప్రజెంట్ ఇదే విషయంపై ఫైమా కూడా రియాక్ట్ అయింది.

‘టీవీ షోలు, ప్రోగ్రామ్ లలో కనిపించే జోడీలేవీ నిజం కాదు. వాటిని నిజ‌మ‌ని అసలు న‌మ్మొద్దు. ప్రవీణ్ ను, న‌న్ను ఆన్‌స్క్రీన్‌లో జోడీగా చూపించారు. ఆడియెన్స్ మా జంట‌ను ఆద‌రించారు. దాన్ని వాడుకుంటూ మేం కూడా యూట్యూబ్‌లో వీడియోలు, రీల్స్ చేశాం. అయితే ప్రవీణ్ కు, నాకు మ‌ధ్య కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందరి ముందు అవి చెప్పుకోలేం. అందుకే మేం దూరం కావాల్సి వ‌చ్చింది. ఇప్పుడు మేం కనీసం మాట్లాడుకోవ‌ట్లేదు కూడా’. గొడవ జరిగినప్పుడు దానిని పూర్తిగా పక్కన పెట్టేయాలే తప్ప అందరి ముందు చెప్పుకుని సమస్యను పెద్దది చేసుకోకూడదు. కానీ ప్రవీణ్ కు తల్లితండ్రులు లేకపోవడంతో అతను మాట్లాడే మాటలు అతనిపై సింపథీ కల్పిస్తున్నాయి. ఈ కారణంగా జనాలు నన్ను నెగెటివ్ గా భావిస్తున్నారు. దయచేసి మా రిలేషన్ కు ఏ పేరూ పెట్టకండి’ అంటూ అభ్యర్థించింది. ప్రస్తుతం ఫైమా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com