jabardasth Faima 500 రూపాయిల అప్పు..ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఫైమా..వైరల్ అవుతున్న లేటెస్ట్ కామెంట్స్!

- Advertisement -

jabardasth Faima ఇప్పుడు మనం చూస్తున్న సెలెబ్రిటీలందరు ఎన్నో కష్టాలను ఎదురుకొని పైకి వచ్చిన వారే. వాళ్ళు ఈరోజు ఈ స్థాయిని ఎంజాయ్ చేస్తున్నారంటే, అంతకు ముందు మనం జీవితం లో చూడలేని దరిద్రాలు అన్నీ వాళ్ళు చూసి వచ్చారు. అలాంటి వారిలో ఒకరు ఫైమా. ఈమె జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంత పాపులారిటీ ని సంపాదించుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ షో ద్వారా వచ్చిన ఫేమ్ తో ఈమెకి బిగ్ బాస్ రియాలిటీ షో లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ షోలో అద్భుతంగా ఆడుతూ, తనదైన మార్కుని ప్రేక్షకుల మదిలో ముద్ర వేసింది.

Jabardasth Faima: పేదరికం నుంచి బిగ్‏బాస్ వేదిక వరకు 'ఫైమా' ప్రయాణం అసాధారణం.. ఆమె జీవితంలో ఎన్ని ఆటుపోట్లో తెలుసా ?.. - Telugu News | Bigg boss season 6 contestant ...

ఈ షో తర్వాత ఆమె నీతోనే డ్యాన్స్ టైటిల్ కూడా కొట్టింది. ఇప్పుడు మళ్ళీ జబర్దస్త్, మరియు ఇతర ఎంటర్టైన్మెంట్ షోస్ లో కనిపిస్తూ ఫుల్ బిజీ గా మారింది. అయితే ఆమె ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్ని కష్టాలు పడిందో రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.ఆమె మాట్లాడుతూ ‘పటాస్ షో కి వచ్చేంతవరకు కూడా మా ఇంట్లో కనీసం టీవీ ఉండేది కాదు. ఒకరోజు మా కాలేజీలో పటాస్ షో లో ఆడియన్స్ కోసం స్టూడెంట్స్ తీసుకెళ్తున్నారు. ఒక్కో స్టూడెంట్ కి 500 రూపాయిలు ఛార్జ్ చేసారు. నా దగ్గర ఏమో 500 రూపాయిలు లేదు. అప్పుడు మా స్నేహితురాలిని బ్రతిమిలాడుకొని 500 రూపాయిలు అప్పు తీసుకొని ఆ షో కి వెళ్లాను. అక్కడ షో మధ్యలో నేను చేసిన కామెడీ కి సంబంధించిన వీడియో బాగా వైరల్ అయ్యింది.

- Advertisement -

Bigg Boss 6 Telugu Faima Remuneration Details Out! - Filmibeat

దాంతో ఒక్క షో ప్రోమో వల్ల ఇంత ఫేమస్ అయ్యాను అంటే, హైదరాబాద్ కి వెళ్లి అక్కడే ఇలాంటి ప్రయత్నాలు చేస్తే మంచి ఆఫర్లు వస్తాయి కదా అని ఇంట్లో చెప్పాను. కానీ హైదరాబాద్ కి వెళ్లేందుకు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. దీంతో నేను అలిగి రెండు రోజులు అన్నం తినలేదు. ఇక ఒక రోజు నేను రూమ్ లోకి వెళ్లి గడి పెట్టుకొని చచ్చిపోతాను అని ఇంట్లో బెదిరిస్తే మా అమ్మ చాలా భయపడి చివరికి హైదరాబాద్ వెళ్లేందుకు ఒప్పుకుంది. ఆ తర్వాత అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి, అదృష్టం కలిసొచ్చి ఈరోజు మీ ముందు ఇలా ఉన్నాను’ అని చెప్పుకొచ్చింది ఫైమా.

Faima: రూ.500 అప్పు.. చచ్చిపోతానని రూమ్‌లో కెళ్లి డోర్ పెట్టుకున్న.. 'జబర్దస్త్' ఫైమ సంచలన కామెంట్స్

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here