Jabardasth Emmanuel : స్కిట్ చేస్తూ పక్కకి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చిన..జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్

- Advertisement -

Jabardasth Emmanuel :బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ఎంతోమందికి మంచి జీవితాలను ప్రసాదించింది. ఈ షో ద్వారా పేరు తెచ్చుకున్న వారు ఇప్పుడు సినిమాల్లో హీరోలుగా.. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, కమెడియన్లుగా కనిపిస్తున్నారు. ఇండస్ట్రీలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రాం ప్రసాద్, ఆది వంటి వారు ఇప్పుడు సినీ పరిశ్రమలో వరుస ఆఫర్లతో బిజీగా మారారు. ఇప్పుడు ఇమ్మాన్యుయేల్ సైతం వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న గం గం గణేశా సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో ఇమ్మాన్యుయేల్ పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తన జీవితంలో ఎదురైన సంఘటనలను మరో సారి గుర్తు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో తన తాత మరణం.. చివరి చూపు కూడా దక్కలేదని చెబుతూ వెక్కి వెక్కి ఏడ్చాడు.

Jabardasth Emmanuel
Jabardasth Emmanuel

 

ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. “జబర్దస్త్ షోకి అడుగు పెట్టిన కొత్తలో అప్పుడప్పుడే మంచి పేరు వస్తుంది. అయితే ఒకరోజు షూటింగ్ జరుగుతున్న సమయంలో నాకు మా నాన్న ఫోన్ చేసి తాత చనిపోయాడంటూ చెప్పాడు. మా తాత అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. కానీ నేను అప్పుడు వెళ్లిపోతే జబర్దస్త్ స్కిట్ డిస్టర్బ్ అవుతుంది. అప్పుడు వెళ్లలేని పరిస్థితి నాది. పక్కకు వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చాను. ఆ తర్వాత కళ్లు తుడుచుకుని స్టేజి పైకి వచ్చి స్కిట్ చేశా. ఆ స్కిట్ అద్భుతంగా వచ్చింది. నేను ఇప్పటివరకు చేసిన స్కిట్స్ అన్నింటిలో అదే బెస్ట్. మా తాత చనిపోయాడనే బాధను మర్చిపోవడానికి బహుశా బాగా పెర్ఫామ్ చేశానేమో. స్కిట్ పూర్తయ్యాక ఇంటికి వెళ్తే అప్పటికే అంత్యక్రియలు పూర్తయ్యాయి. మా తాత కడసారి చూపు కూడా నాకు దక్కలేదు” అంటూ ఎమోషనల్ అయ్యాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here