Dil Raju : వెన్నెల కిషోర్ నుంచి వేణు ఎల్దండి వరకు పలువురు యాక్టర్స్.. కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం అంటూ తమలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసారు. కాకపోతే వారిలో సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. అయితే ఇప్పుడు కమెడియన్ ధన్ రాజ్ కూడా డైరెక్టర్ గా మారబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘జై’ సినిమాలో చిన్న పాత్రలో నటించిన ధనరాజ్.. ‘జగడం’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు.

అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ, తన మార్క్ కామెడీ టైమింగ్ తో టాలీవుడ్ లో కమెడియన్ గా స్థిరపడిపోయారు. ‘జబర్దస్త్’ ‘అదిరింది’ కామెడీ షోలలోనూ నవ్వులు పూయించాడు. తెలుగు ‘బిగ్ బాస్’ సీజన్ 1లో పార్టిసిఫేట్ చేసి పాపులారిటీ పెంచుకున్నాడు. ఆ తర్వాత హీరోగా మారిన ధనరాజ్.. ‘బుజ్జీ ఇలారా’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అలానే ప్రొడ్యూసర్ గా మారి రెండు మూడు సినిమాలు నిర్మించాడు. ఈ క్రమంలో ఇప్పుడు డైరెక్టర్ అవతారమెత్తబోతున్నట్లు తెలుస్తోంది.

కమెడియన్ వేణును దర్శకుడిగా పరిచయం చేసిన అగ్ర నిర్మాత దిల్ రాజు, ధనరాజ్ ను డైరెక్టర్ గా లాంచ్ చేయబోతున్నారట. ధనరాజ్ చెప్పిన కథ నచ్చడంతో తన హోమ్ బ్యానర్ లో డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వడానికి రెడీ అయ్యారట. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా సముద్రఖని లాంటి నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ ను ఒప్పించారట.