Sowmya Rao : పదేళ్ల నుండి విరామం లేకుండా ఈటీవీ లో నవ్వులు పూయిస్తూ ముందుకు దూసుకుపోతున్న బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ కామెడీ జబర్దస్త్. ఈ షో ద్వారా ఎంత మంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారో మన అందరికీ తెలిసిందే. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, షకలక శంకర్, చమ్మక్ చంద్ర, చంటి ఇలా ఒక్కరా ఇద్దరా..ఎంతో మంది నేడు ఇండస్ట్రీ టాప్ ఆర్టిస్టులుగా కొనసాగుతున్నారు.

అలాగే ఈ షో ద్వారానే రష్మీ మరియు అనసూయ వంటి యాంకర్స్ కూడా పరిచయం అయ్యారు. రష్మీ యాంకర్ గా పెద్ద స్థాయి కి వెళ్ళింది, పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది. ఇక అనసూయ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పెద్ద పెద్ద పాన్ ఇండియన్ మూవీస్ లో లేడీ విలన్ గా మెప్పిస్తుంది. జబర్దస్త్ ప్రారంభం నుండి యాంకర్ గా కొనసాగిన అనసూయ ఈమధ్యనే ఈ షో నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే.

ఆమె స్థానం లోకి కన్నడ బ్యూటీ సౌమ్య రావు ని తీసుకున్నారు. ఈమె ఈటీవీ లో పలు సీరియల్స్ లో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత జబర్దస్త్ కి యాంకర్ గా వచ్చింది. ఈ షో లో ఆమె హైపర్ ఆదితో కలిసి వేసిన పంచులు బాగా పేలాయి. ఈ అమ్మాయి కూడా పెద్ద రేంజ్ కి వెళ్తుంది అనుకునేలోపే ఈ షో నిర్మాత శ్యామ్ ప్రసాద్ ఆమెని తప్పించేసాడు.

కారణం ఇంతకు ముందు రేంజ్ లో జబర్దస్త్ కి రేటింగ్స్ రావడం లేదు, డబ్బులు కూడా రావడం లేదు. సౌమ్య రావు అడిగినంత డబ్బులు ఇచ్చే రేంజ్ లేకపోవడం వల్లే ఈ షో నుండి నిర్వాహకులు తప్పించారట. ఈ షో నుండి ఆమె తప్పుకున్న తర్వాత ఆమెకి పెద్దగా అవకాశాలు కూడా రాలేదు, ఏ షో లో కూడా కనిపించడం లేదు, దీనితో సౌమ్య రావు ఫ్యాన్స్ ఆమెని బాగా మిస్ అవుతున్నారు.
