Allu Arjun : స్టైలిష్ స్టార్ పై జబర్దస్త్ నటుడు అనుచిత వ్యాఖ్యలు.. లాక్కొచ్చి చితక్కొట్టిన అభిమానులు

- Advertisement -

Allu Arjun : ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల సంఘం ఫలితాలను ప్రకటించింది. తప్పకుండా అధికారంలోకి మరోసారి వస్తుంది అనుకున్న వైసీపీ కేవలం 11సీట్లకే పరిమితమై అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. ఎవరూ ఊహించని విధంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. దీంతో మరో సారి చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు ఊహించని రితీలో రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికి పలు ప్రాంతాల్లో అల్లర్లు, గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే వైసీపీ నేత కొడాలి నాని, నటి రోజా, వల్లభనేని వంశీలకు చెందిన ఇళ్లపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే వారిపై తీవ్ర విమర్శలు చేసిన జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ తాజా ఇంటర్వ్యూలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై సంచలన కామెంట్లు చేశాడు. అల్లు అర్జున్ మద్దతు పలికిన నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవి చంద్రకిశోర్ ఓడిపోయాడని కామెంట్ చేశాడు. రాష్ట్రం కోసం పదేళ్లుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న పవన్ కల్యాణ్ కు అల్లు అర్జున్ వ్యతిరేకంగా ఉండడం తనకు నచ్చలేదంటూ చెప్పుకొచ్చాడు. దీనిపై మెగా ఫ్యామిలీ స్పందిచకపోయిన.. కిర్రాక్ ఆర్పీ మాత్రం తప్పకుండా స్పందిస్తానన్నాడు. పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇవ్వకపోవడం ముమ్మాటికి తప్పని అల్లు అర్జున్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. గతంలో కూడా కిర్రాక్ ఆర్పీ అల్లు అర్జున్ పై విమర్శలు చేయడంతో అభిమానులు ఆర్పీకి సంబంధించిన రెస్టారెంట్‌పై దాడికి పాల్పడినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన చేపల పులుసు రెస్టారెంట్ పై దాడి జరిగిందని పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here