Jabardast Pavithra : బుల్లి తెర టాప్ కామెడీ షో జబర్ధస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ షో ఎంతోమంది కమెడియన్లకు జీవితాన్ని ప్రసాదించింది. షో ద్వారా పాపులర్ అయిన వాళ్లు ప్రస్తుతం సినిమాల్లో అదరగొట్టేస్తున్నారు. అలాంటి వారిలో పవిత్ర కూడా ఒకరు. టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయింది పవిత్ర.. బుల్లితెర పై సెలబ్రెటీని చేసింది మాత్రం జబర్దస్త్. ఫైమా, రోహిణిలతో ఈక్వల్ గా జబర్దస్త్ ద్వారా పాపులర్ అయి.. లేడీ కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అతి తక్కువ కాలంలోనే మంచి ఫేం తెచ్చుకుని షోలతో పాటు పలు ఈవెంట్లలో కూడా ఈ బ్యూటీ సందడి చేస్తోంది.
తాజాగా ఈమె కారు యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే చిన్న గాయాలతో బయట పడినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ప్రకటించింది. అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది. పవిత్ర పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. సంతోష్ అనే కుర్రాడితో ప్రేమాయణం కొనసాగించింది. ఈ విషయాన్ని తనే సోషల్ మీడియా ద్వారా అఫీషియల్‌గా ప్రకటించింది. అతడితో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది. నిశ్చితార్థం కూడా చేసుకుంది.. చివరకు ఎందుకో తెలియదు కానీ బ్రేకప్ చెప్పి… ప్రస్తుతం కేరీర్ పై ఫోకస్ పెట్టింది.
ఈ విషయమై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.. అందులో .. “నా శ్రేయోభిలాషులు అందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. పరస్పర అంగీకారంతో నేను, సంతోష్ బ్రేకప్ చెప్పుకున్నాం. మా దారులు వేరయినప్పటికీ ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం అలానే ఉంది. మా ఇద్దరి జర్నీలకి ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నాం. ఈ కష్ట సమయంలో మా శ్రేయోభిలాషులు అర్థం చేసుకొని మాకు కాస్త ప్రైవసీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇక నుంచి ఎవరి దారి వారిదే. మా పైన చూపించిన ప్రేమకి థ్యాంక్స్.” అంటూ ఇన్ స్టాలో రాసుకొచ్చింది.
View this post on Instagram