Chiranjeevi : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి హిస్టరీ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన సినీ జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది. ప్రతీ ఒక్కరికి ఆయన జీవిత ప్రయాణం ఒక ఆదర్శమే. అయితే చిరంజీవి హీరో అయ్యే ముందు చిన్న రోల్స్ ద్వారానే నెట్టుకొచ్చాడు. అలాంటి సమయం లో చిరంజీవికి అండగా నిలబడిన వారిలో ఒకరు సూపర్ స్టార్ కృష్ణ. చిరంజీవి కి అప్పట్లో కృష్ణ అంటే విపరీతమైన అభిమానం ఉండేది.
అప్పట్లో చిరంజీవి అప్ కమింగ్ హీరో అయ్యినప్పటికీ, తన రేంజ్ స్టార్ అసలు కాకపోయినప్పటికీ కూడా, ఆయనతో సమానంగా ‘తోడు దొంగలు’ అనే మల్టీస్టార్ర్ర్ సినిమా చేసాడు. ఇది కేవలం చిరంజీవి కోసమే చేసినట్టుగా అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అంతే కాదు చిరంజీవి అప్పట్లో ఫిలిం నగర్ సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అస్సోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా పని చేసాడు.
కృష్ణ కి సంబంధించిన ఏ పని అయినా చిరంజీవి చూసుకునేవాడట. అంతే కాదు అప్పట్లో కృష్ణ గురించి ఒక యంగ్ హీరో తన దగ్గర చెడుగా మాట్లాడేలోపు అతని చెంప పగలగొట్టి, ఇంకోసారి కృష్ణ గారి గురించి ఇలా బయట ఎక్కడైనా మాట్లాడినట్టు తెలిస్తే నిన్ను ఇండస్ట్రీ లో లేకుండా చేయిస్తా అని వార్నింగ్ కూడా ఇచ్చాడట చిరంజీవి. అలా కృష్ణ ని అప్పట్లో చిరంజీవి ఆ రేంజ్ లో ఆరాధించేవాడు. ఒకానొక సందర్భంలో కృష్ణ కి డేట్స్ సర్దుబాటు చెయ్యడానికి వీలు కాకపొయ్యేసరికి ‘ఖైదీ’ చిత్రాన్ని వదులుకోవాల్సి వచ్చింది.
ఈ చిత్రానికి కోదండరామిరెడ్డి దర్శకుడు అనే విషయం తెలిసిందే. నాకు డేట్స్ కుదరడం లేదోయ్, ఈ కథ చిరంజీవి కి కూడా బాగుంటుంది, అతనితో చెయ్యి అని కృష్ణనే రికమెండ్ చేసాడట. ఆ తర్వాత కోదండరామి రెడ్డి ఆ చిత్రాన్ని చిరంజీవి తో చెయ్యడం, అది ఇండస్ట్రీ హిట్ అవ్వడం, చిరంజీవి ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అలా చిరంజీవి పైకి ఎదిగేందుకు కృష్ణ సహాయపడ్డాడు.