Sukumar: టాలీవుడ్ లో మోస్ట్ క్రియేటివ్ గా ఆలోచించి సినిమాలు తీసే దర్శకుల లిస్ట్ తీస్తే అందులో సుకుమార్ మొదటి స్థానం లో ఉంటాడు.ఈయన సినిమాల్లో లాజిక్స్ తో పాటుగా మ్యాజిక్స్ కూడా ఉంటాయి.ఆర్య, ఆర్య 2 , రంగస్థలం, పుష్ప ఇలా ఎన్నో సంచలనాత్మక చిత్రాలను అందించిన సుకుమార్, ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోనే టాప్ 3 డైరెక్టర్స్ లో ఒకరిగా నిలిచాడు.అయితే పాపులారిటీ మరియు క్రేజ్ వచ్చినప్పుడు ఇబ్బందులు కూడా వస్తాయి.
సుకుమార్ విషయం లో కూడా అదే జరిగింది.వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ రావడం తో ఈయనకి రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయిలో పెరిగిందని సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి.ఇది గమనించిన ఐటీ అధికారులు ఈమధ్యనే సుకుమార్ ఇంటి పై సోదాలు జరిపారు.పుష్ప మూవీ షూటింగ్ ని ఆపి మరి ఆయన ఇంటికి వెళ్లి ఐటీ అధికారులు అడిగిన అన్నీ లెక్కలకు సమాధానం చెప్పాడు.
లెక్క పత్రాలు మొత్తం సరిగ్గానే ఉండడం తో సుకుమార్ ని మెచ్చుకున్నారట ఐటీ అధికారులు.అయితే ఆయన ఒక హీరో దగ్గర అప్పు చేసి ఉన్నాడని,మూడేళ్లు అవుతున్న ఇంకా ఆ అప్పు తీర్చలేదని ఈ సోదా లో బయటపడిన విషయం.ఇంతకీ సుకుమార్ కి అప్పు ఇచ్చిన హీరో మరెవరో కాదు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.
పుష్ప సినిమా షూటింగ్ సమయం లోనే అవసరం వస్తే మూడు కోట్ల రూపాయలకు పైగా అల్లు అర్జున్ అప్పు ఇచ్చాడట.ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.ఇక ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్ తో చేస్తున్న ‘పుష్ప : ది రూల్’ చిత్రం కోసం పాన్ వరల్డ్ ఆడియన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఇటీవలే ఈ సినిమా నుండి విడుదలైన గ్లిమ్స్ వీడియో కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.