Upasana : మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కానప్పటికీ హీరోయిన్లను మించి క్రేజ్ సంపాదించుకుంది. రామ్ చరణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చిన ఉపాసన మెగా కుటుంబం పరువు మర్యాదలను మరో మెట్టు ఎక్కించింది అనడంతో సందేహం లేదు. ఉపాసన రామ్ చరణ్ దంపతులు ఇటీవల ఓ కూతురి జన్మనిచ్చారు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ బాధ్యతలే కాకుండా అపోలో హాస్పిటల్కు కూడా చైర్మన్గా వ్యవహరిస్తోంది. కూతురు క్లిన్ కారాను చూసుకుంటూనే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఆసక్తికర పోస్టులు పెడుతూ ఉంటుంది. ఉపాసన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అన్ని రంగాల్లో రాణిస్తూనే కుటుంబం ఆలన పాలన చూసుకుంటుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా, ఉపాసన ఆస్తులకు సంబంధించిన వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమెకు హీరోయిన్లకు మించి.. అందరికంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఉపాసనకు మొత్తం అన్నీ కలుపుకుంటే రూ. 2,500 కోట్ల కంటే ఎక్కువ విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో రామ్ చరణ్ ఆస్తి విలువ రూ. 1,350 కోట్లు కాగా.. ఉపాసనది 1, 150 కోట్ల రూపాయలట. ఈ రెండింటిని కలుపుకుంటే రూ. 2,500 కోట్లు ఆస్తి అవుతుంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన వారంతా మెడా కోడలు ముందు హీరోయిన్లు కూడా దిగదుడుపే అంటున్నారు. అలాగే వాళ్ల ఆస్తి ఈ రేంజ్లో ఉంటే ఇక పెద్దలు ఇచ్చింది.. ఎంత ఉంటుందోనని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.