Sri Hari : కెరీర్ ప్రారంభం లో విలన్ గా ఒక రేంజ్ లో రాణించి, ఆ తర్వాత హీరో గా మారి రియల్ స్టార్ గా ఎదిగి మాస్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న నటుడు శ్రీహరి. ఈయన సినిమాలు అప్పట్లో బయ్యర్స్ కి టాక్ తో సంబంధం లేకుండా లాభాల వర్షం కురిపించేవట.నేల మరియు బెంచ్ టిక్కెట్లు ఒక మూడు వారాల పాటు నాన్ స్టాప్ గా ఫుల్ అయ్యేవి అట.
అలాంటి ఇమేజి సంపాదించుకున్న శ్రీహరి, ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగా చేసిన కొన్ని పాత్రలు తెలుగు సినిమా ఇండస్ట్రీ బ్రతికి ఉన్నన్ని రోజులు గుర్తు పెట్టుకుంటాయి. అలాంటి పాత్రలలో ఒకటి ‘మగధీర’ సినిమాలో ఆయన పోషించిన ‘షేర్ ఖాన్’ పాత్ర. హీరో తో సమానమైన పాత్రలో సహాయనటుడిగా శ్రీహరి ఈ చిత్రం లో అదరగొట్టాడు. ఇప్పటికీ కూడా ఈ సినిమాలో ఆయన సన్నివేశాలు చూస్తే మన రోమాలు నిక్కపొడుచుకుంటాయి.
అయితే రాజమౌళి కి శ్రీహరి అంటే మొదటి నుండి ఎంతో ఇష్టం. ఆయనని తన సినిమాలో తీసుకోవాలి అనుకుంటే కచ్చితంగా ఎంతో పవర్ ఫుల్ గా ఉండే రోల్ కోసమే తీసుకుంటాడు. అలా ఆయన బ్రతికి ఉన్న రోజుల్లోనే బాహుబలి చిత్రం చెయ్యాలని స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. అలా ‘కట్టప్ప’ పాత్ర అనుకున్నప్పుడు, ఈ పాత్రకి శ్రీహరి ఫిక్స్, ఇక వేరే ఛాయస్ లేదు అని అనుకున్నాడట.
శ్రీహరి కి అప్పట్లో ఈ కథని చెప్పి , హీరో ప్రభాస్ తో సరిసమానమైన రోల్ అని చెప్పి ఒప్పించాడట. ఇంతలోపే దురదృష్టం కొద్దీ శ్రీహరి మన అందరినీ వదిలి తిరిగి రాని లోకాలకు పయనం అయ్యాడు. ఆ తర్వాత రాజమౌళి ఆ పాత్ర కోసం మోహన్ లాల్ ని సంప్రదించాడు, కానీ ఆయన ఒప్పుకోలేదు. చివరికి సత్యరాజ్ తో ఆ పాత్ర చేయించి ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసాడు.