Ram Pothineni : మీడియం రేంజ్ హీరోలలో మాస్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకడు రామ్ పోతినేని. ‘దేవదాస్’ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన ఈ యంగ్ హీరో, తొలిసినిమాతోనే ఇతను భవిష్యత్తులో పెద్ద స్టార్ హీరో అవుతాడు అనే రేంజ్ లో హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి కానీ, ‘కందిరీగ’ చిత్రం తర్వాత కెరీర్ ని సరిగా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల ఇంకా మీడియం రేంజ్ హీరోగానే మిగిలిపోయాడు.

ఇది కేవలం రామ్ బ్యాడ్ లక్ అనే చెప్పాలి. మద్యమద్యలో ఆయన హిట్లు ఇస్తూనే ఉన్నాడు కానీ, వేరే లెవెల్ కి వెళ్లే హిట్స్ మాత్రం పడలేదు. ఇప్పుడు రీసెంట్ గా ఆయన ప్రముఖ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో ‘స్కంద’ అనే చిత్రం చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

రీసెంట్ గానే ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమాకి మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయాయి. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమాకి 18 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రం లో రామ్ పడిన కష్టానికి ఆ మాత్రం రావడం లో తప్పు లేదు. కానీ పాపం అతని కష్టానికి తగ్గ పారితోషికం మాత్రం ఈ సినిమాకి దక్కలేదు.

ముందుగా 15 కోట్ల రూపాయిలు ఇస్తామని చెప్పారు, అందుకు అడ్వాన్స్ గా 7 కోట్ల రూపాయిలు ఇచ్చారు. కానీ డైరెక్టర్ బోయపాటి శ్రీను కి మాత్రం 15 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ సినిమా ప్రారంభం కాకముందే ఇచ్చేసారు. కానీ రామ్ కి మాత్రం మిగిలిన బ్యాలన్స్ ఇప్పటి వరకు ఇవ్వలేదట. ఒకవేళ రామ్ తిరిగి అడిగితే సినిమా నష్టపోయింది , ఇక ఇవ్వలేము అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారట నిర్మాతలు, ప్రస్తుతం ఈ గాసిప్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.