Niharika Konidela : సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియా లో నిత్యం ట్రెండింగ్ లో ఉండే పేరు నిహారిక కొణిదెల. మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా ఈమెకి మంచి పాపులారిటీ ఉంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించిన నిహారిక కొణిదెల సక్సెస్ కి ఆమడ దూరం లోనే ఆగిపోయింది. ఇక నటన మనకి అచ్చి రాదులే అని అనుకోని, నటనకి టాటా చెప్పి చైతన్య అనే వ్యక్తిని పెళ్లాడింది.

పెళ్లి తర్వాత ఆమె పలు వెబ్ సిరీస్ లు నిర్మించింది కానీ, ఆమె దురదృష్టానికి తగ్గట్టుగా నిర్మాతగా కూడా సక్సెస్ కాలేకపోయింది. భర్త చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ముందుగా ఆమె ఒక వెబ్ సిరీస్ ద్వారా ఆడియన్స్ ని పలకరించింది. కానీ ఆ సిరీస్ ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

నిన్ననే ఈమె కొత్త సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి వరుణ్ తేజ్ మరియు ఆయన సతీమణి లావణ్య త్రిపాఠి ముఖ్య విచ్చేసారు. ఇదంతా పక్కన పెడితే నిహారిక తన వీపు భాగం లో వేసుకున్న టాటూ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం గా మారింది. ఈ టాటూ ని బాగా గమనిస్తే పక్షి గా అనిపిస్తుంది. ఈ టాటూ ని ఆమె విడాకులు తీసుకున్న తర్వాత వేయించుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.

ఈ టాటూ యొక్క అర్థం ఏమిటంటే, ఇన్ని రోజులు పంజరం బంధించబడ్డ పక్షి లాగ అత్తారింట్లో ఉన్నాను, బయటకి వచ్చిన తర్వాత స్వేచ్ఛ గా ఉన్నాను అని అర్థం వచ్చేలా ఆమె టాటూ ని వేయించుకుంది అంటున్నారు. అత్తారింట్లో పెట్టిన షరతులను భరించలేకనే నిహారిక విడాకులు తీసుకుంది అనే వార్త చాలా రోజుల నుండి సోషల్ మీడియా లో ప్రచారం అవుతూనే ఉంది.