Chiranjeevi – Surekha : సౌత్ ఇండియా లో ఎంతో ఆదర్శవంతమైన దంపతుల జాబితా తీస్తే అందులో చిరంజీవి, సురేఖ జంట కచ్చితంగా మొదటి స్థానం లో ఉంటుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. స్వర్గస్తులు అయిన అల్లు రామలింగయ్య, తన కూతురు సురేఖ ని చిరంజీవి కి ఇచ్చి పెళ్లి చేసే ముందు ఎన్నో టెస్టులు చేసాడు. అన్నీ విధాలుగా టెస్ట్ చేసిన తర్వాత మంచి కుర్రాడు అని నిర్ధారణ వచ్చిన తర్వాతే తన కూతురిని ఇచ్చి పెళ్లి చేసాడు.

భార్య భర్తల మధ్య దాంపత్య జీవితం అన్న తర్వాత గొడవలు రావడం అనేది సర్వసాధారణం. కానీ నాలుగు దశాబ్దాల వీళ్లిద్దరి దాంపత్య జీవితం లో ఒక్కసారి కూడా విబేధాలు రాలేదంటే నమ్ముతారా. కానీ నిజంగానే వీళ్లిద్దరి మధ్య ఒక్కసారి కూడా విబేధాలు రాలేదు. ఈ విషయాన్నీ స్వయానా మెగాస్టార్ చిరంజీవే చెప్పాడు. ఇదంతా పక్కన పెడితే వీళ్లిద్దరి మధ్య ఎంత వయస్సు తేడా ఉంది అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియని విషయం.

అయితే గూగుల్ లో ఉన్న సమాచారం ప్రకారం చిరంజీవి, సురేఖకు మధ్య దాదాపుగా మూడేళ్లు గ్యాప్ ఉన్నట్టు తెలుస్తుంది. చిరంజీవి 1955 వ సంవత్సరం ఆగస్టు 22 వ తారీఖున జన్మించగా, సురేఖ ఫిబ్రవరి 18 , 1958 వ సంవత్సరం లో జన్మించింది. ఒక విధంగా చూసుకుంటే ఇది కాస్త గ్యాప్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈమధ్య కాలం లో పెళ్లిళ్లు ఇంత వయస్సు గ్యాప్ తో జరగడం లేదు కాబట్టి.

ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన వసిష్ఠ అనే దర్శకుడితో ‘విశ్వంభర’ అనే చిత్రం చేస్తున్నాడు. రీసెంట్ గానే రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకున్న ఈ చిత్రం, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష కృష్ణన్ నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.