Naga Chaitanya : అక్కినేని హీరో నాగచైతన్య, సమంత ఈ జంట గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ‘ఏమాయ చేసావే’ సినిమా సమయంలో ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల తర్వాత వీరిద్దరు పెద్దలను ఒప్పించి గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. కానీ వారి కాపురం ఎక్కువ కాలం కొనసాగలేదు. కొద్ది నెలలకే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో డివోర్స్ తీసుకుని విడిపోయారు. అయితే విడాకులు తీసుకున్నప్పటి నుంచి సమంత మయోసైటీస్ వ్యాధి బారిన పడింది. ఇప్పడిప్పుడే ఆ వ్యాధికి ట్రీట్ తీసుకుని కోలుకుంది. ఇక చైతూ విషయానికొస్తే వరుస చిత్రాల్లో నటిస్తూ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ కోసం తాపత్రయ పడుతున్నాడు. అయితే విడాకులైన కొద్ది రోజులకే సెలబ్రిటీలు కొందరు రెండో పెళ్లి చేసుకుంటున్నారు.
కానీ నాగచైతన్య సమంతతో డివోర్స్ తీసుకుని ఇన్ని రోజులు కావొస్తున్నా.. పెళ్లి ఊసే ఎత్తడం లేదు. నాగార్జున కూడా అక్కినేని ఫ్యామిలీకి వారసులు కావాలని, పెళ్లి చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నెటిజన్ల మైండ్లో పలు రకాల ప్రశ్నలు, అనుమానాలు తలెత్తుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా, నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోకపోవడానికి ఓ బలమైన కారణమే ఉన్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆయన జాతకంలో ఓ గండం ఉందట. దాని కారణంగా వివాహ జీవితంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి పరిహార పూజలు చేయాలని మొదటి పెళ్లి అప్పుడే జ్యోతిష్యులు చెప్పారట.
కానీ జాతకాలను నమ్మని నాగచైతన్య వాటిని కొట్టి పారేసి మరీ సమంతను పెళ్లి చేసుకున్నాడట. ఆ తర్వాత విభేదాలతో విడిపోయారు. అయినప్పటికీ ఆయనకు మరో అమ్మాయిని పెళ్లి చేసుకునే ఆలోచన లేదట. కేవలం సినిమాల్లో రాణిస్తూ హిట్స్ అందుకోవాలన్న కోరికే ఉందట. అయితే నాగార్జున మాత్రం చైతన్య పెళ్లి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ పూజలు చేస్తేనే కొడుకు జీవితం బాగుంటుంది కాబట్టి.. దానికి చైతూ ఒప్పుకుని పూజ చేస్తేనే రెండోసారి పెళ్లి ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నాడట. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ అంతా పుకార్లే అని చైతన్య ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు… సమంతతో కలిసి పోతాడేమో అందుకే రెండో పెళ్లి చేసుకోవట్లేదని చర్చించుకుంటున్నారు.