కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన బిగ్ బాస్ సరికొత్త సీజన్ కొద్దీ రోజుల క్రితమే ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సీజన్ ముందు సీజన్స్ లో లాగ కాకుండా సరికొత్త ఉంటుందని, ట్విస్టులు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంటాయని నాగార్జున ఇది వరకే అనేక సార్లు తెలిపాడు. ఆయన చేపినట్టు ఆ రేంజ్ ట్విస్టులు అయితే ఇప్పటి వరకు ఏమి కనిపించలేదు కానీ, గత సీజన్ తో పోలిస్తే చాలా బెటర్ అని మాత్రం అనిపిస్తుంది.
ఇకపోతే ఈ సీజన్ లో చాలా విచిత్రమైన మనిషి గా అనిపించినా కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్. ఇతను బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే ముందు రైతు బిడ్డగా ఇంస్టాగ్రామ్ లో ఏ రేంజ్ పాపులారిటీ తో అడుగుపెట్టాడో మన అందరికీ తెలిసిందే. ఆ సెంటిమెంట్ తోనే హౌస్ లో నెగ్గుకు రావాలని అనుకున్నాడు.
కానీ నిన్న నామినేషన్స్ లో అతని ప్లాన్స్ ని భగ్నం చేసారు హౌస్ మేట్స్. అతను ఆడుతున్న సానుభూతి డ్రామా ని మొత్తం జనాలకు తెలిపే ప్రయత్నం చేసారు. చివరికి ఎంతో క్లోజ్ ఫ్రెండ్ అనుకున్న రతికా కూడా ప్రశాంత్ ని నామినేట్ చేసింది. అలా అందరూ నామినేట్ చేసిన తర్వాత కంట్రోల్ తప్పిపోయిన ప్రశాంత్ మీరంతా నామినేట్ చేసిన నన్ను బయటకి పంపలేరు, బయట నా కోసం ఆర్మీ ఉంది, వాళ్ళు నన్ను గెలిపిస్తారు అంటూ చెప్పుకొచ్చాడు.
అతను అంత బలమైన నమ్మకం తో ఎలా చెప్పగలిగాడు అనేది అతని ఇంస్టాగ్రామ్ అకౌంట్ చూస్తే అందరికీ అర్థం అవుతుంది. ప్రత్యేకమైన టీం ని ఏర్పాటు చేసుకొని ‘జై జవాన్.. జై కిసాన్’ మన రైతు బిడ్డని గెలిపించుకుందాం అంటూ సెంటిమెంట్ ని వాడుకొని ఓట్లు వెయ్యిస్తున్నాడు. ఇదే విషయాన్నీ ఇంట్లో సభ్యులు బయటపెడితే, అలాంటిదేమి లేదంటూ ప్రశాంత్ చెప్పాడు, కానీ బయట జరుగుతుంది మాత్రం ఇదే. అంతే కాదు, ఒక ఏజెన్సీ ని కూడా ఆయన సెట్ చేసుకొని వచ్చాడని, మామూలు ప్లానింగ్ తో అయితే రాలేదు అనే విషయం అర్థం అవుతుంది.