Hi Nanna : న్యాచురల్ స్టార్ హీరో గా నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రం ఈ నెల 7 వ తారీఖున విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. నాని కెరీర్ లో బిగ్ బ్లాక్ బస్టర్ గా నిల్చిన ఈ చిత్రం, ‘సలార్’ విడుదలైన తర్వాత కూడా కొన్ని సిటీస్ లో డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు పోయింది.

ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు 38 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. సంక్రాంతి వరకు థియేటర్స్ లో ఈ సినిమా ఆడే అవకాశం ఉందని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాని చూసిన విహాన్ అనే వ్యక్తి ఇది మా స్టోరీ, మా కథని మేము వెండితెర మీద చూసుకున్నట్టుగా ఉంది అంటూ హీరో నాని మరియు దర్శకుడు సౌరవ్ ని ట్యాగ్ చేసి ట్వీట్ వేసాడు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘మా కథ కూడా ఇంతే, ఇందులో పాప ఉన్నట్టే మా జీవితం లో విహాన్ అనే బాబు ఉన్నాడు. మా బాబు కి కూడా సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉంది, ఈ చిత్రం లోని ప్రతీ సన్నివేశం కి మేము ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాము’ అంటూ ట్వీట్ వేసాడు. దీనికి డైరెక్టర్ స్పందిస్తూ ‘ఏమి మాట్లాడాలో అర్థం కావడం లేదు. కచ్చితంగా మా మూవీ టీం మొత్తం వచ్చి మిమల్ని కలుస్తాము’ అంటూ రిప్లై ఇచ్చాడు.

ఇచ్చిన మాట ప్రకారమే హీరో నాని, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో పాటు మూవీ యూనిట్ మొత్తం విహాన్ కృష్ణ ఇంటికి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇకపోతే థియేటర్స్ లో అద్భుతంగా రన్ అయినా ఈ సినిమా మరో వారం రోజుల్లో ఓటీటీ లో కూడా అందుబాటులోకి రానుంది.
