‘ఉయ్యాలా జంపాల’ మూవీ హీరోయిన్ కి 7 సార్లు పెళ్లి అయ్యిందా.. ఇన్నాళ్లకు బయటపడ్డ షాకింగ్ నిజం

- Advertisement -

చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో మరియు సీరియల్స్ లో నటించి, స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన ‘చిన్నారి పెళ్లి కూతురు’ అనే సినిమా ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరై ఆ తర్వాత అక్కినేని నాగార్జున దృష్టిలో పడి, ‘ఉయ్యాలా జంపాల’ సినిమా ద్వారా హీరోయిన్ గా మారి, తొలిసినిమాతోనే సూపర్ హిట్ ని అందుకున్న నటి అవికా గోర్. ఈమె బాల్యం మొత్తం చైల్డ్ ఆర్టిస్టుగా హిందీ సినిమాలు మరియు సీరియల్స్ లోనే నటించింది.

అవికా గోర్
అవికా గోర్

కానీ ఆమెకి సక్సెస్ లు ఇచ్చింది మాత్రం తెలుగు సినీ పరిశ్రమనే. ‘ఉయ్యాలా జంపాల’ చిత్రం తర్వాత ఈమె చేసిన ‘సినిమా చూపిస్తా మామ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి చిత్రాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఆ తర్వాత కూడా సినిమాలు చేసింది కానీ, అదే రేంజ్ సక్సెస్ స్ట్రీక్ ని కొనసాగించలేకపోయింది. ఈమె చివరిసారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం , గత ఏడాది అక్కినేని నాగ చైతన్య హీరో గా నటించిన ‘థాంక్యూ’.

ఆ సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ అవికా గోర్ కి మంచి పేరు ప్రఖ్యాతలు అయితే వచ్చాయి. ఇప్పుడు ఆమె లేటెస్ట్ గా ‘1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఆమె లేటెస్ట్ గా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

- Advertisement -

ఆమె మాట్లాడుతూ ‘నేను గతం లో ససురల్ సీమర్ కా’ అనే హిందీ సీరియల్ చేశాను.ఇందులో నాకు మూడు సార్లు హీరోతో, నాలుగు సార్లు ఇతర క్యారక్టర్ ఆర్టిస్టులతో , మొత్తం 7 సార్లు పెళ్లి చేసారు.అలా మూడు సార్లు నేను చనిపోయి బ్రతికినట్టుగా చూపించారు. చిన్నప్పుడు వాళ్ళు చెప్పినవి చెప్పినట్టు చేసుకుంటూ వెళ్లాను, కానీ ఇప్పుడు ఆ సన్నివేశాలను తల్చుకుంటే నవ్వు వస్తుంది’ అంటూ అవికా గోర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com