Lavanya Tripathi : టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి కి ఎంత మంచి డిమాండ్ ఉందో మన అందరికీ తెలిసిందే. అందంతో పాటుగా చక్కటి అభినయం, తెలుగు అమ్మాయి కాకపోయినా కూడా చూసేందుకు తెలుగు అమ్మాయి లాగానే కనిపించడం ఈమెలో ఉన్న స్పెషాలిటీ.

నేటి తరం హీరోయిన్స్ కేవలం అందాల ఆరబోతకు మాత్రమే పరిమితం అవుతున్న ఈ రోజుల్లో, లావణ్య త్రిపాఠి నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ని కలిపించుకోవడం గమనార్హం. ఈమె రీసెంట్ గానే వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లాడిన సంగతి మన అందరికీ తెలిసిందే. ‘మిస్టర్’ సినిమా సమయం లో ఏర్పడిన వీళ్లిద్దరి మధ్య స్నేహం, ఆ తర్వాత అది ప్రేమగా మారి పెళ్లి వరకు దారి తీసింది. పెళ్ళికి ముందు ఈ జంట సుమారుగా 5 ఏళ్ళు డేటింగ్ చేసారు.

ఇదంతా పక్కన పెడితే అందరి హీరోయిన్స్ లాగానే లావణ్య త్రిపాఠి పై కూడా అప్పట్లో చాలా రూమర్స్ వినిపించాయి. గతం లో ఈమె అల్లు శిరీష్ తో కలిసి ‘శ్రీరస్తు శుభమస్తు’ అనే సినిమా చేసింది. ఈ చిత్రం కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. అలాగే ఈ సినిమాలో అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. దీంతో వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి అప్పట్లో.

లావణ్య త్రిపాఠి ఇక నుండి అల్లు లావణ్య త్రిపాఠి అంటూ అప్పట్లో ట్రెండ్ కూడా చేసారు అభిమానులు. అయితే ఇదంతా కేవలం రూమర్స్ మాత్రమేనని, తనకి వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ మెగా ఫ్యామిలీ లో బాగా క్లోజ్ కానీ, అల్లు శిరీష్ తో ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా తర్వాత మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ అంటూ అప్పట్లో లావణ్య త్రిపాఠి ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.
