Boney Kapoor : అలనాటి అందాల తార శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ను సంపాదించుకున్న శ్రీదేవి కూతుర్లు జాన్వి కపూర్, ఖుషి కపూర్ కి కూడా ఎలాంటి పాపులారిటీ దక్కిందో తెలిసిందే. ఇక ఇప్పటికే జాన్వి కపూర్.. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది జాన్వీ కపూర్. ఖుషి కపూర్ కూడా బాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

అయితే తాజాగా ఈ అక్క, చెల్లెళ్లు జాన్వీ, ఖుషీ తమ పేరు మీద ఉన్న కొన్ని ఆస్తులను అమ్మినట్లు తెలుస్తోంది. ముంబైలో ప్రతిష్టాత్మక అంధేరి శివారులోని నాలుగు ఫ్లాట్లను ఇప్పటికే ఈ ముద్దుగుమ్మలు అమ్మేశారట. అయితే నగరానికి మోస్ట్ అప్ స్కేల్ ఏరియా అయినా హైఎండ్ లోకండ్‌వాలా కాంప్లెక్స్ లో ఉన్న ఆ ఆస్తులను కేవలం రూ.12 కోట్లకే ఈ కపూర్ సిస్టర్స్ అమ్మేసినట్లు తెలుస్తుంది.

ఈ ఏడాది నవంబర్ 2న బోనీకపూర్, అతని కుమార్తెలు మొదటి అంతస్తులో ఉన్న రెండు ఫ్లాట్స్ ను రూ.6.2 కోట్లకు అమ్మేయగా.. అంతకుముందు అంటే అక్టోబర్ 12న మరో రెండు ఫ్లాట్స్ ని రూ.6 కోట్లకే విక్రయించారట. 14 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆ ఫ్లాట్‌లో రెండు పార్కింగ్ ప్లేసులు ఉన్నాయట. ఇక 2022లో బాంద్రాలో రూ.65 కోట్లతో ఓ డూప్లెక్స్ అపార్ట్మెంట్ కొనుక్కున్న వీరు ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. దీంతో ఈ ఫ్లాట్స్ అవసరం లేదనిపించి ఆ ఉద్దేశంతోనే ఆస్తులను అమ్మేశారట. అందుకనే వారి తండ్రి బోనీ కపూర్ కూడా అక్కా చెల్లెళ్లు ఆస్తులు అమ్ముతుంటే అడ్డు చెప్పలేదని తెలుస్తోంది.