Actor Ajith : ప్రస్తుతం సోషల్ మీడియా కాలం నడుస్తోంది. అది అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలపై ఫోకస్ ఎక్కువైంది. వారికి సంబంధించిన ప్రతీ విషయం సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతోంది. ఇది ఒక్కోసారి వారికి ఇబ్బందులు కలగ జేస్తుంది. అలాంటివి చేయొద్దని ఎంత వారించినా జనాలు మాత్రం ప్రతి వార్తను రాద్ధాంతం చేయడం భూతద్దంలో పెట్టి చూడడం ఎక్కువగా చేస్తున్నారు. రీసెంట్ గా సోషల్ మీడియాలో కోలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ దక్కించుకున్న హీరో అజిత్.. జుట్టు తెల్లగా ఉండడం పై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. తనకు ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో అజిత్ రూ.100 కోట్ల హీరోగా పాపులారిటీ సంపాదించుకున్నాడు.
ఆయన నటించిన సినిమాలు ఫ్లాప్ అయినా సరే కలెక్షన్స్ పరంగా కుమ్మేస్తూ ఉంటాయి. రీజన్ ఏంటో తెలియదు. అజిత్ సినిమాలు ఎంత విభిన్నంగా ఉంటాయో.. మనకు తెలిసిందే. రీసెంట్ గానే అజిత్ ఓ ఆపరేషన్ చేయించుకున్నాడు. దానికి సంబంధించిన వార్తలు కూడా బాగా ట్రెండ్ అయ్యాయి. కాగా అజిత్ కి హెల్త్ ప్రాబ్లం ఉందని ఆ కారణంగానే ఆయన హెల్త్ జుట్టు మొత్తం తెల్ల రంగులో ఉంటుందన్న వార్త ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. తమిళ వివాదాస్పద నటుడు బైల్వన్.. అజిత్ కు కంటి సమస్య ఉన్నట్లు సంచలన నిజాన్ని బయటపెట్టాడు.
ఎప్పటి నుంచో ఆయన కంటి జబ్బుకు సంబంధించి చికిత్స కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు. బయట ఎంతోమందికి అజిత్ చాలా సహాయం చేశాడు అన్న విషయాన్ని కూడా బయటపెట్టారు. అంతేకాదు అజిత్ కి ఇప్పటికే ఎనిమిది ఆపరేషన్లు జరిగాయి అన్న విషయాన్ని కూడా బయట పెట్టాడు. అందుకే ఆయన డ్యాన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడట. ఆయనకి తెల్ల జుట్టు రావడానికి ఆయన వాడే మెడిసిన్సే కారణమంటూ కూడా చెప్పుకొచ్చాడు బైలవాన్. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు మాత్రం కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.