Milk Beauty : టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న తమన్నా.. ఇటీవల బాలీవుడ్, కోలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా ఉంది. ఇదంతా ఇలా ఉంటే తమన్నా అసలు పేరు ఇది కాదట. కొన్ని కారణాల చేత తన పేరును సైతం మార్చుకున్నట్లుగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.. తమన్నా తన సినీ కెరీర్ ని ప్రారంభించి ఇప్పటికీ 20 సంవత్సరాలు పైనే కావస్తున్నప్పటికీ అప్పటికీ ఇప్పటికీ తన గ్లామర్ విషయంలో ఎలాంటి మార్పు లేదు..

తమన్నా అంటే హిందీలో అర్థం కోరిక అట. తమన్నా ఎనిమిది ఏళ్ల వయసు ఉన్నప్పుడే హీరోయిన్ కావాలనుకుందని.. అనుకున్నట్లుగానే టీనేజ్ వచ్చేసరికి మోడలింగ్ వైపుగా అడుగులు వేసిందట.. అయితే ఇండస్ట్రీలో అడుగు పెడదామనుకున్న సమయంలో ఒకాయన తమన్నా కలిశారట. అయితే తమన్నా పేరులోనే మార్పు చేయమని తనకు సూచించారట.. ఇంగ్లీషులో తమన్నా పేరులో అదనంగా ah అనే పదాన్ని జోడించమంటు సలహా ఇచ్చారట.

దీంతో తమన్నా పేరు ఆంగ్లంలో tamannaahగా మారిపోయింది. ఈ పేరు మార్పు తమ్మన్నాలో పాజిటివ్ ఫీలింగ్ తెచ్చిందని తెలుస్తోంది. కెరీర్ పరంగా తమన్నాకు బాగా సరిపోయే పేరు తమన్నా అని ఈ క్యూటీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 5 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. జైలర్ సినిమాలో చిన్న పాత్రలో నటించినా తమన్నాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉందంటూ బాలీవుడ్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి, వీరిద్దరూ అక్రమంగా తిరుగుతున్నారంటూ సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు.