ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి తన సొంత టాలెంట్ తో అశేష ప్రేక్షాభిమానం సంపాదించిన హీరోలలో ఒకడు న్యాచురల్ స్టార్ నాని. ఇతని కెరీర్ ఎలా ప్రారంభం అయ్యిందో మన అందరికీ తెలిసిందే. డైరెక్టర్ అవుదామని కలతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాని, ఆ తర్వాత ప్రముఖ స్టార్ డైరెక్టర్స్ అందరికీ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు. అలా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న సమయం లో నాని ఎన్నో అవమానాలను ఎదురుకోవాల్సి వచ్చింది.

ఒక స్టార్ డైరెక్టర్ అయితే నువ్వు దర్శకత్వం కి మాత్రమే కాదు, అసలు దేనికి పనికిరావు అని అందరి ముందు అవమానించాడు అంటూ నాని పలు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు. అలా సాగుతున్న ఆయన కెరీర్ సురేష్ బాబు తెరకెక్కించిన ‘అష్టా చమ్మా’ సినిమాలో హీరో గా నటించే అవకాశం ఇచ్చింది. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడం తో నాని మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

అయితే నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న రోజుల్లో మహేష్ బాబు హీరో గా నటించిన సినిమాకి కూడా పని చేసే అవకాశం దక్కింది అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అప్పట్లో ఆయన ప్రముఖ డైరెక్టర్ గుణ శేఖర్ కి చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు.

అలా ఆయన మహేష్ బాబు ని హీరో గా పెట్టి చేసిన ‘అర్జున్’ చిత్రానికి న్యాచురల్ స్టార్ నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు. చాలా సన్నివేశాలకు గుణ శేఖర్ లేని సమయం లో మహేష్ బాబు కి సన్నివేశాలను వివరించే వాడట. అలా ఆరోజుల్లో ఆయన మహేష్ బాబు సినిమాతో పాటుగా, ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలకు పని చేసాడు. అలా కెరీర్ ని ప్రారంభించిన నాని నేడు ఏ స్థానం లో ఉన్నాడో మన అందరం చూస్తూనే ఉన్నాం.