Actor Vishwak Sen : కుర్ర హీరోలలో కథల ఎంపిక విషయం లో వైవిద్యం మిస్ కాకుండా, ప్రతీ సినిమాలోనూ తన మార్కు ఉండేలా చూసుకుంటున్న హీరో విశ్వక్ సేన్. ‘ఈ నగరానికి ఏమైంది’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి హీరో గా అడుగుపెట్టిన విశ్వక్ సేన్, ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో ఆయనకీ మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా, క్లాసిక్ స్టేటస్ ని కూడా దక్కించుకున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం తర్వాత ఆయన ‘ఫలక్ నూమా దాస్’, ‘హిట్’,’ఓరి దేవుడా’ మరియు ‘ధమ్కీ’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా , డైరెక్టర్ గా, స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా విశ్వక్ సేన్ ఇండస్ట్రీ లో సక్సెస్ అయ్యాడు. అలా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన విశ్వక్ సేన్ కి సంబంధించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది.

అదేమిటంటే విశ్వక్ సేన్ చైల్డ్ ఆర్టిస్టుగా ఒక సినిమాలో నటించాడట. దీని గురించి ఆయన మాట్లాడుతూ ‘చిన్నతనం నుండే సినిమాలు అంటే పిచ్చి ఉండేది. 9,10 తరగతుల్లో చదువుతున్నప్పుడు సినిమాలో నటించడానికి ఆడిషన్స్ ఇచ్చాను. అలా నాగ చైతన్య జోష్ సినిమా కి ఆడిషన్ ఇస్తే, మరీ చిన్నపిల్లవాడి లాగా ఉన్నానని రిజెక్ట్ చేసారు.

ఆ తర్వాత కూడా నేను చైల్డ్ ఆర్టిస్టు గా చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. అలాంటి సమయం లో దాసరి నారాయణ రావు గారు నిర్మాతగా, జగపతి బాబు హీరో గా నటించిన ‘బంగారు బాబు’ చిత్రం లో బాలనటుడిగా నటించాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా చిన్నతనం లో విశ్వక్ సేన్ ఒక సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసాడు అనే విషయం ఆయన రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో, స్వయంగా ఆయన చెప్పుకుంటే కానీ ఎవరికీ తెలియదు.
