Shivaji : సుమారుగా 96 సినిమాల్లో హీరో గా క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించి ఇండస్ట్రీ లో తనకంటూ ఒక సొంత గుర్తింపు తెచ్చుకున్న నటుడు శివాజీ. నటుడిగా అతనికి పూర్తిగా డిమాండ్ తగ్గిపోయిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. అప్పట్లో సమైక్యాంధ్ర ఉద్యమం అంటూ ధర్నాలు, నిరాహారదీక్షలు చేసాడు. ఆ తర్వాత బీజేపీ పార్టీ లో కొన్నాళ్ళు కొనసాగాడు, తర్వాత తెలుగు దేశం పార్టీ లో కూడా చాలా రోజులు పనిచేసాడు.
ఆపరేషన్ గరుడ అంటూ అప్పట్లో ఈయన ఇచ్చిన ఒక సెమినార్ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు రేపిందో మన అందరికీ తెలిసిందే. 2019 తర్వాత అటు సినిమాల్లోనూ , ఇటు రాజకీయాల్లోనూ యాక్టీవ్ గా ఉండడం మానేసిన శివాజి, ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ 7 లో ఒక కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి అందరినీ షాక్ కి గురి చేసాడు. మొదటి రోజు నుండి కండబలం లేకుండా బుద్ధిబలం తోనే ఆయన హౌస్ లో మనుగడ కొనసాగిస్తూ వస్తున్నాడు.
అయితే ఈయన హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి పల్లవి ప్రశాంత్ పట్ల ఎంతో అభిమానం ఉన్నవాడిలాగా ప్రవర్తిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ‘రైతు బిడ్డ’ గా ఇంస్టాగ్రామ్ ద్వారా మంచి ఫాలోయింగ్ ని సంపాదించిన ప్రశాంత్ కి సపోర్టుగా నిలుస్తూ తన ఆట మీద కంటే కూడా ప్రశాంత్ ఆట మీదనే ఎక్కువ ద్రుష్టి సారించి, అతనికి సలహాలు ఇవ్వడం మొదలు పెట్టాడు.
ఒకానొక సమయం లో ఇతను టైటిల్ గెలవడానికి వచ్చాడా?, లేకపోతే ప్రశాంత్ ని గెలిపించడానికి వచ్చాడా అనే సందేహం జనాలకు కలిగింది. రీసెంట్ ఎపిసోడ్లో కూడా నాకు అసలు బిగ్ బాస్ హౌస్ లో ఉండాలని లేదురా, కేవలం మీ ఇద్దరి కోసమే ఉన్నాను అంటూ ప్రశాంత్ మరియు యావర్ ని పట్టుకొని ఏడ్చాడు. ఇదంతా కామన్ మ్యాన్ రైతు బిడ్డ కి అండగా నిలబడినట్టు నటించి, జనాల్లో సానుభూతి పొంది, తన రాజకీయ మైలేజ్ కోసమే శివాజీ ఇలా చేస్తున్నాడని, అతని టార్గెట్ బిగ్ బాస్ టైటిల్ కాదని, రాజకీయ మైలేజ్ అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.