Samantha : తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచిందన్నట్లు హీరోయిన్ సమంత పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఆమె చేసిన ప్రతి పనిలోనూ ఆటంకం కలుగుతుంది. సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సమంతకు వరుసగా ఫ్లాప్స్ పడుతున్నాయి. ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా మయోసైటీస్ అనే అరుదైన వ్యాధి కూడా ఆమెకే సోకడం.. దాని కారణంగా కొన్నాళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరం కావడం జరిగింది.
ఇటీవల ఆమె ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసింది. ట్రాలాల అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేసిన సమంత ఇక లైఫ్ లో సెటిల్ అవుతుందిలే అని అంతా అనుకున్నారు. కానీ సమంత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన రెండు రోజులకే అక్కినేని ఫ్యామిలీ నుంచి తనకు భారీ షాక్ తగిలినట్టు తెలుస్తుంది. నాగచైతన్య కూడా కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారట. ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీకి ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది.
అయినా.. కానీ నాగచైతన్య తన సొంత డబ్బులతో కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నాడట. ఇప్పటికే పలు బిజినెస్‌లు స్టార్ట్ చేసిన నాగచైతన్య.. సమంత ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేసిన రెండు రోజులకే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. చూడాలి మరి వీళ్ల పట్టింపులు ఎంత వరకు తీసుకెళ్తాయో ?