Tabu : ఏంటి ఆంటి ముసలి వయసులో మీకు రొమాన్స్ అవసరమా.. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన హీరోయిన్

- Advertisement -

Tabu : అందాల తార టబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన వారిలో టబు ఒకరు. తన అందాలతో, నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తన నటనతో రెండు జాతీయ, ఆరు ఫిలింఫేర్ అవార్డులు అందుకుంది టబు. అటు నార్త్ టు సౌత్ అభిమానులకు సుపరిచితురాలైన ఈ అమ్మడికి ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లోనూ సత్తా చాటుకుంటుంది.

కెరీర్ మొదట్లో టాలీవుడ్ స్టార్ హీరోల పక్కన హీరోయిన్‌గా జతకట్టింది టబు.. ఇప్పటికి కూడా హీరోయిన్‌గానే నటిస్తూ తన గ్లామర్‌ ఏమాత్రం తగ్గలేదని ఢంకాబజాయించి చెబుతోంది. ఇటీవల విడుదలైన ‘క్రూ’ సినిమాతో భారీ హిట్ ను అందుకుంది. ఇందులో తనదైన శైలిలో నటించి ప్రశంసలు దక్కించుకుంది. సినిమాలో కృతి సనన్, కరీనాకపూర్ లను డామినేట్ చేసింది. దాదాపు 50 ఏళ్లు వచ్చినప్పటికీ రొమాన్స్ చేసేందుకు రెడీ అంటోంది. ఈ వయసులో మీకు రొమాంటిక్ సినిమాలు అవసరమా అని ప్రశ్నించిన రిపోర్టర్‌కు టబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అసలు ఏం జరిగిందంటే..

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తదుపతి చిత్రం చిత్రం ‘ఔర్ మే క్యా దమ్ థా’. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్రబృందం. ఈ మేరకు మీడియాతో ముచ్చటించిన టీమ్.. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇందులో భాగంగా.. 50 ఏళ్ల వయసులో రొమాంటిక్ సినిమా చేయడంపై మీ ఫీలింగ్ ఏంటీ ప్రశ్న టబుకి ఎదురైంది. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘రొమాన్స్ కేవలం యువకులకు లేదా పరిమిత వయస్సుకు మాత్రమే అంకితమైనది కాదు. మీరు రొమాన్స్, లవ్, రిలేషన్‌షిప్ గురించి మాట్లాడేటప్పుడు అడ్డంకులు ఉండవని నేను అనుకోవడం లేదు. నిజానికి ఈ సినిమా ప్రేమ, శృంగారం కంటే రిలేషన్ షిప్‌తో ఎక్కువగా ముడిపడి ఉంది’ అంటూ టబు చెప్పుకొచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here