Laxmi Pranathi : ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కి బాగా ఇష్టమైన పవన్ కళ్యాణ్ సినిమా అదేనా..?

- Advertisement -

Laxmi Pranathi : మెగా మరియు నందమూరి కుటుంబాల మధ్య బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పోటీ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా ఆ రెండు కుటుంబాలు ఎంతో సన్నిహితంగా ఉంటాయి. ఈ రెండు కుటుంబాల్లోని నిన్నటి తరం స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ ఎంతో స్నేహం గా ఉంటారు. ఈమధ్య కొన్ని మనస్పర్థలు వచ్చాయి కానీ, ఒకప్పుడు అయితే ఇద్దరు సోదరులు లాగ కలిసిపోయేవారు.

Laxmi Pranathi
Laxmi Pranathi

ఇక నేటి తరం స్టార్ హీరోలైన ఎన్టీఆర్ , రామ్ చరణ్ కూడా ఎంత మంచి స్నేహితులో మన అందిరికీ తెలిసిందే. వాళ్ళ మధ్య ఉన్న ఆ స్నేహం కారణంగానే అసాధ్యం అనుకున్న మల్టీస్టార్రర్ కూడా చేసి పాన్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసారు. జూనియర్ ఎన్టీఆర్ కి అయితే కేవలం మెగా ఫ్యామిలీ తోనే కాదు, తన తోటి స్టార్ హీరోలందరితో మంచి సాన్నిహిత్యం ఉంది. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మాత్రం అంతగా పరిచయం లేదు.

వీళ్ళిద్దరూ పలు సందర్భాల్లో కలిశారు. రామ్ చరణ్ నిశ్చితార్థం సమయం లో వీళ్లిద్దరు మాట్లాడుకున్న మాటలు అప్పట్లో సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపింది. ఆ తర్వాత ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ మూవీ ఓపెనింగ్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ రెండు సందర్భాల్లో తప్ప మిగిలిన సందర్భాల్లో వీళ్ళు కలుసుకున్నట్టు ఎక్కడా దాఖలాలు లేవు.

- Advertisement -

కానీ ఎన్టీఆర్ మరియు అతని కుటుంబం అందరి సినిమాలను చూస్తూ ఉంటారు. అలా ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కి పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో ‘ఖుషి’ అంటే చాలా ఇష్టమట. కాలేజీలో చదువుకునే రోజుల్లో ఆమె ఈ సినిమాని ఎన్నో సార్లు చూసిందట. అలాగే ఆమెకి ఎన్టీఆర్ కాకుండా టాలీవుడ్ బాగా నచ్చే హీరో న్యాచురల్ స్టార్ నాని అని స్వయంగా ఎన్టీఆర్ అప్పట్లో ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here