Tollywood Stars : RRR చిత్రానికి ఆస్కార్ అవార్డ్స్ రావడం తో ప్రపంచం మొత్తం మన టాలీవుడ్ వైపు చూడడం మొదలు పెట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ సినిమాలో హీరోలు గా నటించిన రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కీర్తి ప్రతిష్టలు ప్రపంచం నలుమూలల వ్యాప్తి చెందింది. ఇంత టాలెంట్ ఉన్న హీరోలు మా ఇండస్ట్రీ లో లేరు అంటూ కొంతమంది హాలీవుడ్ ప్రముఖ దర్శకులు కూడా కితాబు ఇవ్వడం వంటివి ఎన్నో మనం చూసాము.

ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు చేస్తున్న సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండబోతున్నాయి. కేవలం రామ్ చరణ్ , ఎన్టీఆర్ మాత్రమే కాదు. ప్రభాస్, అల్లు అర్జున్ కూడా నేషనల్ వైడ్ గా అద్భుతమైన క్రేజ్ ని సంపాదించారు. భవిష్యత్తులో వీళ్ళే ఇండస్ట్రీ ని ఏలుతారు అనే అభిప్రాయం రావడం తో ప్రముఖ హాలీవుడ్ ఓటీటీ సంస్థ ‘నెట్ ఫ్లిక్స్’ అధినేత రీసెంట్ గానే ఈ హీరోలందరినీ కలిసింది.

సడన్ గా నెట్ ఫ్లిక్స్ అధినేత టెడ్ సరాండోస్ టాలీవుడ్ స్టార్ హీరోలను ఎందుకు కలిసాడు?, వీరితో పాటుగా రాజమౌళి ని కూడా ప్రత్యేకంగా కలిసాడు. ప్రతీ ఒక్కరితో ఒక వెబ్ సిరీస్ కానీ, సినిమా కానీ తియ్యాలని అనుకుంటున్నాడా?, లేకపోతే రాజమౌళి దర్శకత్వం లో స్టార్ హీరోలందరినీ కలిపి ‘అవెంజర్స్’ లాంటి సిరీస్ లేదా సినిమాని తియ్యాలని అనుకుతున్నాడా? అనే సందేహాలు మొదలు అయ్యాయి.

కానీ లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఏమిటంటే, నిజంగానే రాజమౌళి దర్శకత్వం లో ఈ హీరోలందరినీ కలిపి ఒక సినిమా తీసే ప్లాన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే బయటకి తెలియ చేయబోతున్నారట. ఇది ఇండియా కి సంబంధించిన సినిమా కాదని, హాలీవుడ్ చిత్రమని కూడా అంటున్నారు. చూడాలి మరి. ఒకవేళ ఇది నిజం అయితే మాత్రం టాలీవుడ్ రేంజ్ కలలో కూడా ఊహించని విధంగా వెళ్తుందని అంటున్నారు ఫ్యాన్స్.
