krithi shetty : ఉప్పెన చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ , ఫాలోయింగ్ ని తెచ్చుకున్న కృతి శెట్టి కి ఈమధ్య కాలం లో సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేక, వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో అవకాశాలకు గండి కొట్టుకున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా ఎక్కడికో వెళ్తుంది అనుకున్న కృతి శెట్టి కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి, అక్కడి లాగానే ఉంది పరిస్థితి.

దానికి తోడు శ్రీలీల ఇండస్ట్రీ లో క్లిక్ అవ్వడం తో యంగ్ హీరోల దగ్గర నుండి, స్టార్ హీరోల వరకు అందరూ ఆమె వైపే చూస్తున్నారు కానీ, కృతి శెట్టి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. రీసెంట్ గా జరిగిన ఒక సంఘటన చూస్తే పాపం కృతి శెట్టి అనిపించక తప్పదు.

ఆమె స్థానం లో వేరే హీరోయిన్ ఆ సందర్భం లో ఉండి ఉంటే సీన్ వేరేలా ఉండేది. అసలు విషయానికి వస్తే యంగ్ హీరోయిన్స్ లో అత్యధికంగా షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కి వెళ్ళేది కృతి శెట్టి మాత్రమే. రీసెంట్ గా ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లిన ఆమెకి ఒక వింత అనుభవం ఎదురైంది. ఒక అభిమాని కృతి శెట్టి తో మాట్లాడుతూ ‘మీరంటే నాకు చాలా ఇష్టం..మీ లేటెస్ట్ మూవీ స్కంద లో అద్భుతంగా నటించారు’ అని అంటాడు. దానికి కృతి శెట్టి కి నవ్వాలో, కోపం తెచుకోవాలో అర్థం కాక, చిన్నగా చిరు నవ్వు నవ్వుతూ, ఆ సినిమాలో హీరోయిన్ నేను కాదు అండీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇది చూసిన నెటిజెన్స్ ఎక్కడికో వెళ్తుంది అనుకున్న కృతి శెట్టి కి ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి అని బాధపడుతున్నారు.
