Kamal Haasan : మన టాలీవుడ్ లో నేటి తరం హీరోలలో అత్యధిక కల్ట్ క్లాసిక్ చిత్రాలు ఉన్నవారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈయన కొత్త సినిమాలను అందరికీ నచ్చినా, నచ్చకపోయినా..పాత సినిమాలు మాత్రం ప్రతీ ఒక్కరికి నచ్చుతాయి. తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి, సుస్వాగతం, జల్సా ఇలా ఒక్కటా రెండా ఎన్నో ఆణిముత్యాలు లాంటి సినిమాలు తీసాడు.
అంతే కాకుండా ఒకే మూసలో వెళ్తున్న టాలీవుడ్ హీరోల నటన కి, పవన్ కళ్యాణ్ నటనకి అప్పట్లో చాలా తేడా ఉండేది. అది ఆడియన్స్ కి కొత్తగా అనిపించడం వల్లే ఆయనకి ఆ రేంజ్ కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ పాత సినిమాలకు ఉన్న క్రేజ్ వేరు. అందుకు నిదర్శనం రీసెంట్ గా ఆ సినిమాలు రీ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించడమే.
రీ రిలీజ్ అయ్యి అత్యధిక వసూళ్లను టాలీవుడ్ లో రాబట్టిన టాప్ 5 మూవీస్ లిస్ట్ తీస్తే అందులో పవన్ కళ్యాణ్ వి మూడు ఉన్నాయి. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆయన పాత సినిమాల రేంజ్ ఏమిటి అనేది. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా అంటే సినీ సెలబ్రిటీస్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. హిందీ లో అమితాబ్ బచ్చన్ ఈ సినిమాని ఎంతో ఇష్టం గా సమయం దొరికినప్పుడల్లా చూసేవాడట.
ఈ విషయాన్నీ స్వయంగా ఆ చిత్ర దర్శకుడు కరుణా కరణ్ తెలిపాడు. అలాగే తమిళ హీరోలందరికీ ఈ తొలిప్రేమ సినిమా అంటే ఎంతో ఇష్టం. కమల్ హాసన్ కి కూడా ఈ సినిమా చాలా ఇష్టమట. రీసెంట్ గా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న శృతి హాసన్ ఈ విషయాన్నీ చెప్పుకొచ్చింది. ‘నాన్న గారికి పవన్ కళ్యాణ్ సినిమాల్లో తొలిప్రేమ అంటే చాలా ఇష్టం..అప్పట్లో తీరిక దొరికినప్పుడల్లా చూసేవాడు. అంతలా ఆయనకి ఆ చిత్రం కనెక్ట్ అయ్యింది’ అంటూ చెప్పుకొచ్చింది.