పోకిరీ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన మూవీ. 200థియేటర్లలో 100రోజులు ఆడి రికార్డులను తిరగరాసింది. ఇటు మహేశ్ బాబు కు అటు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కేరీర్లోనే చెప్పుకోదగ్గ మూవీగా నిలిచింది. ఈ సినిమాతో మహేశ్ స్టార్ డమ్ మరింత పెరిగింది. ఆ సినిమాతోనే స్టార్ డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ కి మంచి పేరు కూడా వచ్చింది. పోకిరీ సినిమా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ కూడా ఏర్పడింది. ఆ తరువాత మళ్లీ వీరి కాంబినేషన్లో బిజినెస్ మ్యాన్ వచ్చింది. అది కూడా అంచనాలను మించి హిట్ అయింది. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా కోసం వారిద్దరి అభిమానుల ఆత్రుతతో వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పూరి జగన్నాథ్ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు.

దీంతో ఏ స్టార్ హీరో కూడా అతనికి కాల్షీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ సమయంలోనే పూరి జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన ఈ సినిమాను మహేశ్ తో తీయాలని ఎన్నో కలలు కన్నాడు. గతంలో దాదాపు షూటింగ్ కూడా స్టార్ట్ అయిందని వార్తలు కూడా వచ్చాయి. అభిమానులు పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేశారు. కానీ పూరితో తీయటానికి మహేశ్ ఆసక్తి చూపట్లేదని తెలుస్తోంది. మహేశ్‌కి ఈ సినిమా విషయంలో పూరి రెండు మూడు సార్లు ఫోన్ కూడా చేశారట. అయినా అంతటి స్టార్ డైరెక్టర్ కాల్ కూడా లిఫ్ట్ చేయలేదట. ఒక ఇంటర్వ్యూలో పూరి మాట్లాడుతూ ఫ్లాపుల్లో ఉండే వాళ్లని మహేశ్ పట్టించుకోరంటూ సెటైర్ కూడా వేశారట. వీరిద్దరి మధ్య అప్పటి నుంచే గ్యాప్ వచ్చింది. ‘మహేశ్ ను కలవడానికి చాలా సార్లు ప్రయత్నించాను.. కానీ అందుకు నమ్రత ఒప్పుకోలేదని సమాచారం. ఎందుకంటే అప్పటికే మహేశ్ స్టార్ హీరో పొజిషన్లో ఉన్నాడు. పూరి వరుస ఫ్లాపులతో నిండా మునిగి ఉన్నాడు. కాబట్టి పూరితో సినిమా చేస్తే తన మార్కెట్ డౌన్ అవుతుందని నమ్రత మహేశ్ అపాయింట్ మెంట్ కూడా ఇచ్చేది కాదట. ఇలా వీరిద్దరి కాంబో సినిమాపై ఫ్యాన్స్ కు నమ్మకం ఉంది కానీ మహేశ్ కు నమ్మకం లేదని పూరి చెప్పుకొచ్చారు.
